ఒకరు మృతి.. 11 మందికి గాయాలు
కర్నూల్ బ్యూరో, (ఆంధ్రప్రభ) : కర్నూలు జిల్లా (KurnoolDistrict) ఎమ్మిగనూరు మండలం కోటకల్ క్రాస్ సమీపంలోని జాతీయ రహదారి (ఎన్‌హెచ్-167) పై ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఆదోని మండలం కపటి గ్రామానికి చెందిన కూలీలను తీసుకువెళ్తున్న ఆటోను ఒక కర్ణాటక రిజిస్ట్రేషన్ టెంపో వాహనం ఢీకొనడంతో తీవ్ర ప్రమాదం జరిగింది.
ఈ ప్రమాదంలో రంగవేణి (Rangaveni) (14) అనే బాలిక అక్కడికక్కడే మృతిచెందగా, మరో 11 మంది తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిలో ఆరుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ప్రమాద బాధితులను సమీపంలోని ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.


