Temple | సొంత నిధులతో…

Temple | సొంత నిధులతో…
Yadadri | చౌటుప్పల్, ఆంధ్రప్రభ : యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ పట్టణంలోని వలిగొండ రోడ్డులో ఉన్నశ్రీ బాలాజీ రామకృష్ణ(Sri Balaji Ramakrishna) దేవాలయంలో అయ్యప్ప స్వాములు, భక్తుల సౌకర్యార్థం చౌటుప్పల్ మున్సిపల్ కాంగ్రెస్ నాయకులు బత్తుల విప్లవకుమార్ గౌడ్ తన సొంత నిధులతో బోర్ను వేయించడంతో పాటు దేవాలయం ముందు షెడ్డుకు విరాళంగా ధనరూపేన సహకారం అందించారు.
దేవాలయం ఆవరణలో దేవాలయ కమిటీ ఆధ్వర్యంలో ఈ రోజు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో దాత విప్లవ కుమార్ గౌడ్(Vipul Kumar Goud)ను ఘనంగా సన్మానించారు. బోర్ ను ప్రారంభించారు.
ఈ కార్యక్రమంలో దేవాలయ కమిటీ అధ్యక్షుడు నాగిళ్ళ రామచంద్రం, ఉపాధ్యక్షుడు చింతల ప్రభాకర్ రెడ్డి(Chintala Prabhakar Reddy, కోశాధికారి ఎలుక రాజు నాగరాజు, ఉపాధ్యక్షుడు ఉష్కాగుల శ్రీనివాస్ గౌడ్, తోర్పునూరి నరసింహ గౌడ్, గట్టు పవన్, నక్కెరగంటి శ్రీశైలం, చెవగోని మహేష్ గౌడ్, ఉదరి యాదయ్య, జక్కర్తి శేఖర్, ఊదరి మారయ్య, దేవాలయం గౌరవ సలహాదారులు బత్తుల శ్రీశైలం గౌడ్, అన్నమోని గోవిందరాజు, ఆలయ ప్రధానార్చకులు పి సంతోష్ కుమార్ శాస్త్రి తదితరులు పాల్గొన్నారు.

