Temple | వైభవంగా రేణుక ఎల్లమ్మ కళ్యాణోత్సవం

Temple | వైభవంగా రేణుక ఎల్లమ్మ కళ్యాణోత్సవం
Temple | ఆలేరు, ఆంధ్రప్రభ : యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలంలోని కొలనుపాక లోని శ్రీ సాయి రేణుకా మాత దేవాలయ ఆలయ కమిటీ ఆధ్వర్యంలో శుక్రవారం శ్రీ రేణుక ఎల్లమ్మ దేవి జమదగ్ని మహఋషుల కల్యాణోత్సవం ఎంతో వైభవంగా జరిగింది. తుమ్మల పద్మ లక్ష్మమా రెడ్డి హేమాళ్ల అరుణ ఉపేందర్ రెడ్డి ఈ కళ్యాణోత్సవాన్ని జరిపించారు.
వేద పండితులు లక్కవజ్జుల సుబ్రమణ్యం శాస్త్రి సిద్ధాంతి, పాండురంగ శాస్త్రి సిద్ధాంతి, శ్రీనుపంతులు, ఆలయ అర్చకులు రవి పాండే కళ్యాణోత్సవ నిర్వహణలో పాల్గొన్నారు. శ్రీ సాయి రేణుకా మాతా ఆలయ కమిటీ గౌరవ అధ్యక్షుడు వాసం సత్యం, అధ్యక్షుడు గాదె సోమి రెడ్డి, ప్రధాన కార్యదర్శిఅంకంరాజయ్య, కోశాధికారి అంకం రమేష్, ఆర్గనైసింగ్ సెక్రటరీ రాసమల్ల కొండల్, అంకం శ్రీను, సహాయ కార్య దర్శి రాజబోయిన కొండల్, ఉపాధ్యక్షులు కాటమ సాయి లు,మామిడాల నర్సింహులు, దోర్నాల వెంకన్న,బండారి సాయి కల్యాణ,సాయిరాం, బండారి మల్లేష్, కల్యాణం నారాయణ, అంకం రఘు, రాసమల్ల రేవంత్, బాదిని సాగర్ తదితరులు, భక్తులు హాజరయ్యారు. పంబాల కళాకారులు ఎల్లమ్మ కథను కళ్యాణానంతరం ప్రదర్శించారు.
