Temple | ధనుర్మాస పూజలు ప్రారంభం..
Temple, కోడూరు, ఆంధ్రప్రభ : కోడూరు గ్రామాల్లో వేంచేసియున్న శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ కళ్యాణ వేంకటేశ్వరస్వామి వారి ఆలయంలో వైభవంగా ధనుర్మాస పూజలు ప్రారంభమయ్యాయి. ఆలయ ప్రధాన అర్చకులు దుంబాల శ్రీధరాచార్యలు మంగళవారం శ్రీ గోద అమ్మవారికి ప్రత్యేక పంచామృత అభిషేకం నిర్వహించారు. అధిక సంఖ్యలో భక్తులు పాల్గొనగా ఆలయ చైర్మన్ కోట పద్మావతి వర ప్రసాద్ ఏర్పాట్లు పర్యవేక్షించారు.

