Temple |ధర్మ రక్షణతోనే సమాజానికి శ్రేయస్సు

Temple | ధర్మ రక్షణతోనే సమాజానికి శ్రేయస్సు

కుంభాభిషేకం ఆలయ శక్తిని పునరుజ్జీవింపజేసే ఆధ్యాత్మిక క్రతువు

కంచి కామకోటి పీఠాధిపతి జగద్గురు విజయేంద్ర సరస్వతి

Temple | ఇంద్రకీలాద్రి, ఆంధ్రప్రభ : ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ఇంద్రకీలాద్రిపై జరిగిన మహా కుంభాభిషేక కార్యక్రమం అనంతరం కంచి కామకోటి పీఠాధిపతి జగద్గురు శంకర విజయేంద్ర సరస్వతి మహాస్వామి భక్తులకు అనుగ్రహ భాషణం చేశారు. ఈ సందర్భంగా ధర్మ రక్షణ, ఆధ్యాత్మిక జీవనం ప్రాముఖ్యతను వివరించారు. కుంభాభిషేకం అనేది కేవలం ఒక ఉత్సవం కాదని, ఆలయంలోని దైవశక్తిని పునరుజ్జీవింపజేసే మహత్తర ఆధ్యాత్మిక ప్రక్రియ అని స్వామీజీ తెలిపారు.

గత మూడు రోజులుగా జరిగిన హోమాలు, జపాలు, అభిషేకాల ద్వారా ఇంద్రకీలాద్రిపై జగన్మాత శక్తి మరింత పెంపొందిందని పేర్కొన్నారు. ఈ పుణ్యకార్య ఫలం రాష్ట్రంతో పాటు సమస్త మానవాళికి శ్రేయస్సు చేకూర్చాలని ప్రార్థించారు. కంచి పీఠాధిపతులలో మహాస్వామిగా ప్రసిద్ధి చెందిన శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి ఆధ్యాత్మిక మార్గం అందరికీ ఆదర్శమని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ ధర్మబద్ధమైన జీవన విధానాన్ని అనుసరిస్తూ భక్తి మార్గంలో నడవాలని సూచించారు.

సత్యం బ్రూయాత్ ప్రియం బ్రూయాత్ అనే వాక్యాన్ని ఉటంకిస్తూ వాక్కును నియంత్రించుకోవడం వాక్ తపస్సు అని స్వామీజీ చెప్పారు. మాతృభాషను గౌరవించడం అంటే మన సంస్కృతిని గౌరవించడమేనని, తెలుగు వంటి ప్రాచీన భాషలు ఆధ్యాత్మిక సంపదకు నిలయాలని వివరించారు. ధర్మం సమాజాన్ని ఏకతాటిపై నిలిపే శక్తి అని, దేవాలయాలు కేవలం ప్రార్థనా స్థలాలు కాకుండా సంస్కృతి, సదాచారాలకు కేంద్రాలని స్వామీజీ పేర్కొన్నారు.

Temple |
Temple |

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలని ఆశీర్వదించారు. కార్యక్రమాన్ని సమర్థవంతంగా నిర్వహించిన దేవదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, దేవదాయ శాఖ కమిషనర్ కె. రామచంద్ర మోహన్, దేవస్థానం ఈవో శీనానాయక్, పాలకమండలి చైర్మన్ రాధాకృష్ణ, అర్చకులు, పండితులకు ప్రత్యేక మంగళాశాసనాలు అందజేశారు. ఇంద్రకీలాద్రిపై జరిగిన ఈ కార్యక్రమంలో వేలాదిమంది భక్తులు పాల్గొని స్వామీజీ అనుగ్రహ భాషణాన్ని శ్రద్ధగా ఆలకించారు.

CLICK HERE TO READ MORE : 9thcentury | కడెం తీరంలో పురాతన ఆలయం గుర్తింపు

CLICK HERE TO READ MORE :

Leave a Reply