శ్రీవెంకటేశ్వర స్వామీ పుణ్యక్షేత్రం మహాఅద్భుతం

శ్రీవెంకటేశ్వర స్వామీ పుణ్యక్షేత్రం మహాఅద్భుతం
శ్రీశ్రీశ్రీ మదవానంద సరస్వతి స్వామీజి
జుక్కల్, ఆంధ్రప్రభ : జుక్కల్ మండలంలోని ఖండేబల్లూర్ గుట్టపై ఉత్తర ద్వారం గల శ్రీ వెంకటేశ్వర స్వామీ పుణ్యక్షేత్రం మహా అద్భుతమని బాగ్లాముఖి శక్తిపీఠం(రంగంపేట) పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ మాధవానంద సరస్వతి స్వామీజీ అన్నారు. ఖండేబల్లూర్ గుట్టపై కొలువుదీరిన ఉత్తరద్వారా శ్రీవెంకటేశ్వర స్వామీని ఆయన శనివారం దర్శించుకోవటమే కాకుండా ప్రత్యేక పూజలు నిర్వహించారు. జుక్కల్ ప్రాంతంలో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం ప్రసిద్ధిగాంచిందని, ఈఅద్భుత ఆలయాన్ని ఈ ప్రాంత వాసులు సమిష్టిగా కృషిచేసి ఆధునికరించవలసిన అవసరం ఎంతైనాఉందని స్వామీజీ అన్నారు.
ఈ ఆలయ పరిసర ప్రాంతంలో విశాలమైన స్థలం ఉండటంతో ఇక్కడ కళ్యాణవేదికతో పాటు భక్తులకు సకలసౌకర్యలు కల్పించవలసిన అవసరం ఉందన్నారు. వాస్తుఅనేది పూర్తి శాస్ట్రీయం కాదని, ప్రస్తుతం మార్రి చెట్టుకొట్టేసి, మల్లెచెట్టు పెట్టె విధానం దాపురించిందని, కావున చెట్లలను, గుట్టకు హాని చెయ్యకుండా కొత్తగా సదుపాయాలు ఏర్పాటు చేయాలన్నారు. గుడికి వెళ్ళటానికి మెట్లు బాగున్నాయని భక్తులకు మెట్లు ఎక్కడానికి ఆసరాగా గ్రిల్స్ నిర్మించాలన్నారు. ఈ పుణ్యక్షేత్రంలో ఆహ్లాదకర వాతావరణం ఉండటంతో స్వామిజీ తమసంతోషాన్ని వ్యక్తంచేశారు.

కొత్త ఆలయాల జోలికి పోకుండా ముందుగా పురాతనమైన ఆలయాలను అభివృద్ధి పరచుకోవాల్సిన అవసరం మన అందరిపై ఉందన్నారు. మనదేశం సంస్కృతి సాంప్రదాయాలకు నిలబద్దమని ప్రతి ఒక్కరూ పాశ్చాత సంస్కృతిని విడనాడి, మన సంస్కృతి సంప్రదాయాలను అవలంబించాలన్నారు. ఈ సందర్భంగా ఖండేబల్లుర్ సర్పంచ్ చాకలికృష్ణ, దత్తు మహరాజ్ జోషి, పూజారి విట్ఠల్ మహరాజ్ ఖండేబల్లూర్, కేంరాజ్ కల్లాలి, కౌలాస్, జుక్కల్ తదితర గ్రామాల పెద్దలు భక్తులు,ప్రజలు హాజరై స్వామీజి దర్శనం చేసుకోవటమే కాకుండా, పాదపూజ నిర్వహించారు. శ్రీమాధవానంద సరస్వతి స్వామీజీ సేవా సమితి వారు అన్నదానం ఏర్పాటు చేయడమే కాకుండా భక్తులకు సకల సౌకర్యాలు కల్పించడం జరిగింది.

