temple | ఎల్లమ్మ ఆలయానికి 10 కే.వి సింగిల్ ఫేస్ బుడ్డి…

temple | ఎల్లమ్మ ఆలయానికి 10 కే.వి సింగిల్ ఫేస్ బుడ్డి…
temple | నిజాంపేట, ఆంధ్రప్రభ : మండల కేంద్రంలో ప్రసిద్ధిగాంచిన శ్రీ రేణుక ఎల్లమ్మ ఆలయం వద్ద కరెంటు సమస్య ఉందని విద్యుత్ ఏఈ గణేష్ దృష్టికి గౌడ సంఘ సభ్యులు తీసుకెళ్లడంతో వెంటనే ఆయన స్పందించి ఎల్లమ్మ ఆలయానికి 10 కేవి సింగల్ ఫేస్ బుడ్డిని కేటాయించారు. మంగళవారం నందిగామ లైన్మెన్ దేవుని రాజేష్ ఆధ్వర్యంలో సింగల్ ఫేస్ బుడ్డికి కరెంట్ సప్లై ను ప్రారంభించారు.
ఆలయానికి నిరంతరం కరెంట్ సరఫరా ఉండేందుకు కృషి చేసిన విద్యుత్ ఏఈ గణేష్,కు గౌడ సంఘ సభ్యుల తరపున ధన్యవాదాలు తెలియజేశారు.గతంలో ఆలయం వద్ద సింగల్ ఫేస్ కరెంటు ఉండేది కాదని కరెంటులేక ఎన్నో కష్టాలు అనుభవించామని కరెంటు కష్టాలు తీర్చిన విద్యుత్ శాఖ అధికారులకు గౌడ కులస్తులు రుణపడి ఉంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో గౌడ కులస్తులు బజార్ సిద్ధ గౌడ్, జీడి చిన్న అంజాగౌడ్,జీడి చంద్రకాంత్ గౌడ్, వీరగౌని శ్రీనివాస్ గౌడ్,నవీన్ గౌడ్, బజార్ రంజిత్ గౌడ్, ప్రణయ్ గౌడ్, ఉన్నారు.
