Temple | గాలిగోపురం నిర్మాణ పనుల పరిశీలన

Temple | గాలిగోపురం నిర్మాణ పనుల పరిశీలన

Temple | కుంటాల ఆంధ్రప్రభ : మండల కేంద్రమైన కుంటాలని శ్రీ గజ్జలమ్మ దేవి ఆలయం గాలిగోపురం నిర్మాణ పనులు ఈ రోజు ప్రారంభ అయ్యాయి. ఈ సందర్భంగా దేవాదాయ శాఖ నుండి 32 లక్షల రూపాయలు శ్రీ గజలమ్మ ఆలయ నిర్మాణానికి గాలిగోపురం కోసం నిధులు మంజూరు కావడంతో ముధోల్ ఎమ్మెల్యే పవర్ రామారావు ప్రారంభించారు.

అనంతరం స్థానిక సర్పంచ్ జక్కుల గజేందర్ గాలిగోపురం యొక్క పనులను ప్రారంభించగా ఆయన పరిశీలన చేశారు. పనులు వేగవంతం అయ్యేందుకు సంబంధిత కాంట్రాక్టర్ కృషి చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు జుట్టు మహేంద,ర్ పడకంటి దత్తు భోగ లక్ష్మణ్, తాటి శివ, డాక్టర్ శీను, ధోనిగామ రాజు, బోగ గోవర్ధన్, కాంట్రాక్టర్ మోహన్ రావు పటేల్, ఆలయ కమిటీ సభ్యులు, గ్రామస్తులు, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply