Temple | ఆధ్యాత్మిక దైవచింతన అలవర్చుకోవాలి

Temple | ఆధ్యాత్మిక దైవచింతన అలవర్చుకోవాలి

  • ఆధ్యాత్మికతతోనే మానవునికి ముక్తిమార్గం
  • కోటకొండవిద్వాన్ జయతీర్థ ఆచార్యులు

Temple | ఊట్కూర్, ఆంధ్రప్రభ : ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక దైవచింతన పెంపొందించుకోవాలని కోటకొండ విద్వాన్ జయతీర్థ ఆచార్యులు ఉద్బోధించారు. మంగళవారం నారాయణపేట జిల్లా ఊట్కూర్ మండల పరిధిలోని పెద్ద జట్రం గ్రామ శివారులో బదిరి నారాయణస్వామి సన్నిధిలో మధ్వనోమి ఉత్సవ వేడుకలు వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… ఆధ్యాత్మిక చింతన అలవర్చుకోవడం ద్వారా సకల శుభాలు జరుగుతాయనిఅన్నారు.

దైవకార్యానికి ప్రతి ఒక్కరూ నియమనిష్టలతో హాజరైతే సుభిక్షంగా ఉంటారన్నారు. ఈ ఉత్సవాల సందర్భంగా భక్తులను ఉద్దేశించి ఆధ్యాత్మిక ప్రవచనం చేశారు. విద్వాన్ అనిల్ దేశాయి శ్రీహరి నేతృత్వంలో పవమాన హోమం నిర్వహించారు. విశేష పంచామృత అభిషేకం పుష్పార్చన నిర్వహించారు. హరిదాసుల సంకీర్తనలతో పల్లెకి సేవ కార్యక్రమం కొనసాగింది. గ్రామ సర్పంచ్ వాకిటి వెంకటేష్ ఆలయ ప్రాంగణంలో విద్యుత్ దీపాలు వెలిగించేలా చర్యలు తీసుకున్నారు.

Temple |

అనంతరం ప్రత్యేక పూజలు పాల్గొన్నారు. నారాయణపేట శక్తిపీఠం స్వామితానంద దర్శించుకుని పూజలు చేపట్టారు. ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు శ్రీధర్ రావు నారాయణ రావు, శ్రీనివాసరావు, ఆనందరావు, మధుసూదన్ రావు, గ్రామ పెద్దలు సుదర్శన్ రెడ్డి, భక్తులు, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply