Temple | శ్రీశైలంలో సంప్రదాయబద్దంగా భోగిమంటలు…

Temple | శ్రీశైలంలో సంప్రదాయబద్దంగా భోగిమంటలు…
- బోగి మంటలు జీవితాలలో వెలుగులు…
Temple | నంద్యాల బ్యూరో, ఆంధ్రప్రభ : జిల్లాలోని ప్రముఖ పుణ్యకేత్రమైన శ్రీశైలంలోని భ్రమరాంబిక మల్లికార్జున స్వామి దేవస్థానంలో బుధవారం సంస్కృతీ సంప్రదాయ పరిరక్షణలో భాగంగా వేకువజామున భోగిమంటలు కార్యక్రమాన్ని నిర్వహించినట్లు కార్యనిర్వాహణాధికారి ఏం. శ్రీనివాసరావు తెలిపారు. ప్రధాన ఆలయ మహాద్వారం ఎదురుగా గంగాధర మండపం వద్ద ఈ కార్యక్రమం నిర్వహించారు.
కార్యక్రమంలో దేవస్థానం కార్యనిర్వహణాధికారి దంపతులు, ధర్మకర్తల మండలి సభ్యులు ఎ.వి.రమణ, ప్రత్యేక ఆహ్వానితులు ఎ. శ్రీనివాసులు, శ్రీస్వామివారి ప్రధానార్చకులు హెచ్.వీరయ్యస్వామి, పలువురు అర్చకస్వాములు తదితర సిబ్బంది పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో ముందుగా అర్చకస్వాములు, వేదపండితులు లోకకల్యాణాన్నికాంక్షిస్తూ సంకల్పాన్ని పఠించారు.

అనంతరం సంప్రదాయబద్దంగా పిడకలు, ఎండుగడ్డి, వంటచెరుకుని వేసి “భోగిమంటలు” వేయబడ్డాయి. సంక్రాంతి సందర్భంగా వేసే భోగిమంటలకు మన సంప్రదాయంలో ఎంతో విశిష్టత ఉంది. ఈ భోగిమంటలు వేయడం వలన దుష్టపీడలు విరగడై, అమంగళాలు తొలగి సకలశుభాలు కలుగుతాయని చెప్పబడుతోందన్నారు. ముఖ్యంగా మన సంస్కృతి సంప్రదాయాలపై అందరికీ మరింత అవగాహన కల్పించాలనే భావనతో ఏటా దేవస్థానం ఈ భోగిమంటల కార్యక్రమాన్ని నిర్వహిస్తోందన్నారు. కార్యక్రమంలో పలువురు పాల్గొన్నారు.
