Temple | ఏపీ భవన్‌లో సంక్రాంతి శోభ..

Temple | ఏపీ భవన్‌లో సంక్రాంతి శోభ..

  • న్యూఢిల్లీలో ఏర్పాట్లు చేసిన దుర్గగుడి అధికారులు..
  • కనకదుర్గమ్మ ప్రతిరూప ఆలయంలో పండుగ ఏర్పాట్లు

Temple | (ఆంధ్రప్రభ ఇంద్రకీలాద్రి) : న్యూఢిల్లీలోని ఏపీ భవన్ ప్రాంగణంలో కొలువై ఉన్న శ్రీ కనకదుర్గమ్మ వారి ప్రతిరూప ఆలయంలో సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకుని వేడుకల ఏర్పాట్లు పూర్తయ్యాయి. పండుగ శోభను ప్రతిబింబించేలా ఆలయాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. ఇంద్రకీలాద్రిపై వేంచేసియున్న శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానంలోని సంప్రదాయాలను అనుసరిస్తూ, ఢిల్లీలోని ఈ ప్రతిరూప ఆలయంలో కూడా అదే విధంగా పూజా కార్యక్రమాలు, ప్రత్యేక అలంకరణలు నిర్వహిస్తున్నారు.

సంక్రాంతి పండుగను పురస్కరించుకుని పుష్పాలు, దీపాలతో ఆలయాన్ని ఆకర్షణీయంగా అలంకరించారు. ఈ అలంకరణ ఏర్పాట్లను దుర్గగుడి సూపరింటెండెంట్ జగదీష్ నేతృత్వంలోని ప్రత్యేక బృందం పర్యవేక్షిస్తోంది. భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా దర్శనాలు, పూజా కార్యక్రమాల నిర్వహణకు అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని ఆలయ అధికారులు తెలిపారు. సంక్రాంతి వేడుకల సందర్భంగా ఢిల్లీలో నివసిస్తున్న తెలుగు ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో, భక్తుల సౌకర్యాలపై ప్రత్యేక దృష్టి సారించినట్లు అధికారులు వెల్లడించారు.

Leave a Reply