TEMJU | ఛలో కలెక్టరేట్

TEMJU | ఛలో కలెక్టరేట్

27న కలెక్టర్ కార్యాలయo ఎదుట నిరసన


TEMJU | చిట్యాల, ఆంధ్రప్రభ : ఛలో కలెక్టరేట్ ను విజయవంతం చేద్దామ‌ని టీఈఎంజేయూ (TEMJU) నకిరేకల్ నియోజకవర్గం అధ్యక్షులు కొల్లోజు శ్రీకాంత్ తెలిపారు. ప్రభుత్వం కొత్తగా తెచ్చిన జీ.ఓ. 252ను సవరించాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈనెల 27వ తేదీన శనివారం నల్లగొండ జిల్లా (Nalgonda District) కేంద్రంలో కలెక్టర్ కార్యాలయం ఎదుట ఉదయం 10.30 గంటలకు తలపెట్టిన తెలంగాణ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టు యూనియన్ ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమంలో జిల్లా వ్యాప్తంగా జర్నలిస్టులు పెద్దఎత్తున తరలివచ్చి విజయవంతం చేయాలని కొల్లోజు శ్రీకాంత్ కోరారు. అప్పటి లోపు ప్రభుత్వం జీఓను సవరించాలని తాము కోరుకుంటున్నామని, రాజ్యాంగం కల్పించిన హక్కుగా దీర్ఘ కాలిక ఆందోళన కార్యక్రమాలకు శ్రీకారం చుడతామని హెచ్చరించారు.

Leave a Reply