- తెలుగుదేశం నాయకులు గోవింద్ కు అభినందలు తెలిపిన నాయక శ్రేణులు.
రాజానగరం : రెండున్నర దశాబ్దాలుగా గణపతి భగవానుని నవరాత్రుల సందర్భంగా ప్రముఖ రచయిత పురాణపండ శ్రీనివాస్ ఏటికేడాది ఒక సంవత్సరానికి మించి ఒక సంవత్సరం అద్భుతంగా , అమోఘంగా రచించి , సంకలనం చేసి ప్రచురిస్తున్న శ్రీ మంగళ గణపతి గ్రంథ వైభవ సొగసులు లక్షల పాఠకుల మనసుల్ని కట్టేయడమే కాకుండా మేధో సమాజం ఆశ్చర్యపోయేలా చెయ్యడం కేవలం దైవబలంగానే వేల వేల రసజ్ఞులు ప్రశంసలు వర్షిస్తున్నారు.
ఈ వినాయక చవితి సందర్భంగా పురాణపండ శ్రీనివాస్ అందించిన అపురూపం ‘ నిను ప్రార్ధన చేసెద ‘ గ్రంధం పరమ సౌందర్యంగా ఉండటమే కాకుండా ప్రఖ్యాత సాహితీవేత్త, పద్మశ్రీ , శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం ఉపకులపతి కొలకలూరి ఇనాక్ హైదరాబాద్ రవీంద్రభారతిలో ఆవిష్కరిస్తూ శ్రీనివాస్ పై కురిపించిన ప్రశంసలకు వందల ఆహూతులే సాక్షి.
ఖైరతాబాద్ గణపతి ఆహ్వాన పత్రికతో పాటు ఉత్సవ కమిటీ వారు ఈ సంవత్సరం పురాణపండ ‘ నిను ప్రార్ధన చేసెద ‘ దివ్య మంగళ గ్రంధాన్ని బహూకరించడం గోదావరీతీరాస్థులకు గర్వకారణంగా చెప్పక తప్పదు.
ఇదిలా ఉండగా … మంగళవారం రాజానగరం జరిగిన తెలుగుదేశం పార్లమెంటరీ సమావేశంలో అతిరథమహారధులకు ప్రముఖ పాల వర్తకులు, తెలుగుదేశం పార్టీ సీనియర్ జిల్లా నాయకులు నిమ్మలపూడి గోవింద్ మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ దిగ్గజం, కడియం శాసన సభ్యులు గోరంట్ల బుచ్చయ్య చౌదరిచే ఈ అద్భుత ‘ నిను ప్రార్ధన చేసెద ‘ గ్రంధాన్ని ఆవిష్కరింపచేసి అక్కడి తెలుగుదేశం శ్రేణులకు , నాయకులకు అందించడంతో గోవిందును ఇంతటి ఉత్తమ గణపతి గ్రంధాన్ని అందించినందుకు పలువురు ప్రశంసించడం గమనార్హం. ఈ సందర్భంగా పురాణపండ శ్రీనివాస్ అసాధారణ ప్రతిభ , నిస్వార్ధ మనస్తత్వం , కాలానికి ఎదురీదుతూ చేసే ధార్మిక సేవను పలువురు కొనియాడారు.
మరోవైపు భారతీయ జనతాపార్టీ జాతీయ స్థాయి నాయకులు , ఎమ్మెల్సీ సోము వీర్రాజు సమర్పణలో మహాద్భుత పవిత్ర గ్రంధం ఇరవైఏడవ పునర్ముద్రణ ప్రముఖ రచయిత పురాణపండ శ్రీనివాస్ పరమాద్భుత రచన ‘ శ్రీమాలిక ‘ అపురూప విలువల గ్రంధాన్ని ఆంధ్రప్రదేశ్ పురపాలక శాఖామంత్రి , నారాయణ కళాశాలల చైర్మన్ పి . నారాయణ కు అందించగా … వినాయక చవితి పర్వదిన సందర్భంలో ఇటువంటి మహత్తర గ్రంధాన్ని అందించినందుకు సోము వీర్రాజుకు ధన్యవాదాలు తెలపడం గమనార్హం.
రెండు రాష్ట్రాలలో పురాణపండ శ్రీనివాస్ తుఫాన్ లా చేస్తున్న ధార్మిక ఆధ్యాత్మిక నిస్వార్ధ సేవ , దివారాత్రాల కృషి, అసాధారణ రచనాపటిమ వేల వేల మందిని ఆకర్షిస్తోందనడంలో సందేహాలనవసరమని చెప్పక తప్పదు.


