అజారుద్దీన్ బాధ్యతల స్వీకరణ

అజారుద్దీన్ బాధ్యతల స్వీకరణ

హైదరాబాద్, ఆంధ్రప్రభ : తెలంగాణ కాంగ్రెస్ నేత మహ్మద్ అజారుద్దీన్ (Mohammed Azharuddin) ఇవాళ మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. కుటుంబ సభ్యులతో కలిసి సచివాలయానికి చేరుకున్న ఆయన మైనార్టీల సంక్షేమ శాఖ ( (Minority Welfare Department), పబ్లిక్ ఎంటర్‌ప్రైజెస్ శాఖల ఛాంబర్‌లో ముస్లిం ప్రార్థనల మధ్య ఛార్జ్ తీసుకున్నారు.

ఈ సందర్భంగా అజారుద్దీన్ మాట్లాడుతూ… ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Chief Minister Revanth Reddy) పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని ప్రకటించారు. సీఎంకు కృతజ్ఞతలు తెలిపారు. ఆయనకు పలువురు నేతలు, అధికారులు శుభాకాంక్షలు అందజేశారు. గత నెల 31న గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ అజారుద్దీన్ ను మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయించారు. నవంబర్ 4న ఆయనకు శాఖలు కేటాయించగా, ఈ రోజు అధికారికంగా బాధ్యతలు చేపట్టారు.

Leave a Reply