Telangana | ఘనంగా బాలల దినోత్సవ వేడుకలు…..

Telangana | ఘనంగా బాలల దినోత్సవ వేడుకలు…..

Telangana | రేగొండ, ఆంధ్రప్రభ : రేగొండ మండలంలోని విక్టరీ హైస్కూల్లో బాలల దినోత్సవ వేడుకలు ఈ రోజు ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. ఈ సందర్భంగా విద్యార్థులకు ఫ్యాన్సీ డ్రెస్ షో(Fancy dress show) నిర్వహించారు. ప్రత్యేక సమావేశంలో నెహ్రూ చిత్రపటానికి పాఠశాల కరెస్పాండంట్ కటకం రాజు పూలమాల వేసి నివాళులు అర్పించారు.

ఈ సందర్భంగా పాఠశాల కరస్పాండెంట్ మాట్లాడుతూ.. నేటి బాలలే రేపటి భావి భారత పౌరులని అన్నారు. విద్యార్థులకు నెహ్రూ జీవితం గురించి వివరించారు. దేశ స్వాతంత్రం కోసం నెహ్రూ చేసిన పోరాటం, స్వాతంత్రం అనంతరం దేశానికి ప్రధానమంత్రిగా నెహ్రు చేసిన సేవలను విద్యార్థులకు తెలియచెప్పారు.

విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు ఆహ్లాదాన్ని పాఠశాల ఆవరణలో ఎంతగానో అలరించాయన్నారు. సాంస్కృతిక కార్యక్రమాల అనంతరం విద్యార్థులకు బహుమతుల ప్రధానం, మిఠాయిలు, పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు. సంతోష్, రాకేష్, అరుణ, శిరీష, మౌనిక, అనురాధ, శైలజ, శృతి విద్యార్థిని, విద్యార్థులు తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply