Telangana | గుర్తుతెలియని వ్యక్తులు..

Telangana | గుర్తుతెలియని వ్యక్తులు..

Telangana | వెబ్ డెస్క్, ఆంధ్రప్రభ : తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండలంలో క్షుద్ర పూజలు చేసిన సంఘటన స్థానికంగా కలకలం రేపింది. టేకులపల్లి మండలంలోని లచ్చ తండాలో గుర్తుతెలియని వ్యక్తులు క్షుద్రపూజలు చేశారు.

గ్రామస్తులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి… లచ్చాతండా గ్రామంలో ఓ ఇంటి సమీపంలో క్షుద్ర పూజలు చేసిన గుర్తులు కనిపించాయి. ఎర్రటి మూటలు, నల్లటి మూటలు కట్టి, అందులో వివిధ పూజ సామాగ్రిని పెట్టి పూజలు చేసిన గుర్తులున్నాయి. నిమ్మకాయలు, పసుపు, కుంకుమ, చిల్లర పైసలు, ఎర్రటి, నల్లటి వస్త్రాలతో యంత్రాల లాగా కట్టి ప్రజలను భయాందోళనలకు గురిచేస్తున్నాయి.

Leave a Reply