Telangana | అభివృద్ధే ప్రధాన లక్ష్యం

Telangana | అభివృద్ధే ప్రధాన లక్ష్యం

Telangana | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : తెలంగాణ ప్రభుత్వం ప్రజల సంక్షేమం, ఉపాధి అవకాశాల పెంపు, పారిశ్రామిక అభివృద్ధిని ప్రధాన లక్ష్యంగా పెట్టుకుని రాబోయే బడ్జెట్‌ను సమగ్రంగా రూపొందించే దిశగా కట్టుబడి ఉందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క స్పష్టం చేశారు.

ఇవాళ రాష్ట్ర సచివాలయంలో కార్మిక, ఉపాధి, శిక్షణ, ఫ్యాక్టరీలు, గనులు, భూగర్భశాఖల ఉన్నతాధికారులతో ఆయన ప్రీ-బడ్జెట్ సమీక్ష సమావేశం నిర్వహించారు. రాష్ట్ర బడ్జెట్ నేపథ్యంలో ఆయా శాఖల ప్రాధాన్యతలు, ప్రస్తుతం అమలవుతున్న కార్యక్రమాల పురోగతి, ఉపాధి అవకాశాల విస్తరణ, ప్రజలకు మెరుగైన సేవలు అందించే దిశగా చేపట్టాల్సిన చర్యలపై సమగ్రంగా చర్చ జరిగింది.

ఈ సమావేశంలో భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. ప్రజల జీవనోపాధి, ఉద్యోగ అవకాశాలు, పరిశ్రమల అభివృద్ధి, కార్మికుల సంక్షేమం ప్రభుత్వ ప్రాధాన్యతల్లో ముందుంటాయని, రాబోయే బడ్జెట్‌లో ఈ అంశాలకు ప్రత్యేక శ్రద్ధ చూపుతామని హామీ ఇచ్చారు.

Leave a Reply