Telangana | కాకతీయ జూలాజికల్ పార్క్ లో..

Telangana | కాకతీయ జూలాజికల్ పార్క్ లో..
Telangana | వెబ్ డెస్క్, ఆంధ్రప్రభ : తెలంగాణ రాష్ట్రంలోని వరంగల్ లోని హంటర్ రోడ్డు కాకతీయ జూలాజికల్ పార్క్ లో వైట్ టైగర్ (శరణ్) ఇవాళ ఎక్లోజర్ లో చనిపోయింది. కాగా, వృద్ధాప్యం, మల్టీ ఆర్గాన్ ఫెల్యూర్ తో చనిపోయిందని జూపార్క్ అధికారులు అంటున్నారు. పులి అంత్యక్రియలు చేసినట్లు జూపార్క్ పర్యవేక్షణ అధికారి మయూరి తెలిపారు. హైదరాబాద్ జూ పార్క్ నుంచి తెల్ల పులిని జూలై మాసంలో వరంగల్ తీసుకొచ్చారు. పులి సంరక్షణ సరిగా లేకనే అనారోగ్యానికి గురై మృత్యువాత పడినట్లు సమాచారం. అధికారులు మాత్రం పులి అనారోగ్యం, గుండెపోటుతో చనిపోయిందని చెబుతున్నారు.
