Tekumatla | అంగన్వాడి సేవలను వినియోగించుకోవాలి..

Tekumatla | అంగన్వాడి సేవలను వినియోగించుకోవాలి..

Tekumatla | టేకుమట్ల, ఆంధ్రప్రభ : భూపాలపల్లి జిల్లా టేకుమట్ల మండలం వెంకట్రావుపల్లి గ్రామంలోని అంగన్వాడి కేంద్రంలో ఐసీడీఎస్ సూపర్వైజర్ సరోజన, గ్రామ సర్పంచ్ పెరుమండ్ల చంద్రకళ మొగిలి గౌడ్ హాజరై అన్నప్రసాద కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… తల్లిదండ్రులు అంగన్వాడి కేంద్రాల్లో పిల్లలకు విద్య, పౌష్టికాహారం, సామాజిక కార్యక్రమాలు అందిస్తున్న అంగన్వాడి సేవలను ప్రశంసించారు. పిల్లలు, తల్లిదండ్రుల ఆనందం కోసం అన్నప్రాసాద‌ పాటలతో కూడిన విద్యను అందిస్తున్నారని, ప్రతి తల్లిదండ్రులు తమ పిల్లలను తప్పనిసరిగా అంగన్వాడి కేంద్రాలకు పంపాలని కోరారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్స్ రజిత, రాజకుమారి, ఆయా రేణుక గర్భిణీ స్త్రీలు, బాలింతలు, కిశోర బాలికలు, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply