Tekmal | భార్యను చంపి తానూ..

Tekmal | భార్యను చంపి తానూ..

Tekmal | మెదక్ జిల్లా టేక్మాల్ మండలంలో ఘటన

Tekmal | టేక్మాల్ : కష్టాలను ఎదిరించి కలిసిమెలిసి నిండునూరేళ్ళూ (A hundred years) జీవిస్తామని చేసుకున్న పెళ్ళినాటి ప్రమణాలు గుర్తుకు రాలేదేమో…కలిసి కాపురం చేసిన క్షణాలు గుర్తుకు రాలేదేమో. పంచుకున్న ప్రేమానురాగాలూ గుర్తుకు రాలేదేమో…
తాళికట్టిన క్షణం నుండీ నీ ఆలనాపాలనా రక్షణా నాది అని పంచభూతాల సాక్షిగా చేసిన బాసలు ఏమయ్యాయో మరి…

కట్టుకున్న భార్యను కడతేర్చి తానూ బలవన్మరణానికి పాల్పడిన సంఘటన మెదక్ (Medak) జిల్లా టేక్మాల్ మండలంలో చోటుచేసుకుంది.

Tekmal

Tekmal | ఉదయాన్నే ఉలిక్కిపడిన ఊరు

స్థానికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. టేక్మాల్ మండలంలోని బర్దిపూర్ గ్రామానికి చెందిన గంగారాం శ్రీశైలం(37) మంజుల(34) గత కొన్నిరోజులుగా హైదరాబాద్ (Hyderabad) లో ఉంటు జీవనం సాగిస్తునారు. దసరా పండగ సదర్బంగా ఊరికి వచ్చి ఊరిలోనే ఉంటున్నారు. 2 డిసెంబర్ 2025 మంగళవారం ఉదయం ఇంట్లో ఇద్దరు మృతి చెంది కనిపించారు. భార్యను హత్యచేసి భర్త తాను దూలనికి ఉరివేసుకొని మృతి చెందాడని గ్రామస్థులు తెలిపారు. ఇరువురి మృతిపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇంకా పూర్తి వివరాలు తెలియవలసి ఉంది. సంఘటనా స్థలానికి పోలీసులు చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Leave a Reply