Tech Mahindra | 30న మెగా జాబ్ మేళా

Tech Mahindra | 30న మెగా జాబ్ మేళా

  • నిరుద్యోగులు స‌ద్వినియోగం చేసుకోవాలి
  • కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్

Tech Mahindra | శ్రీకాకుళం, ఆంధ్రప్రభ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఎచ్చెర్ల లోని వెంకటేశ్వర ఇంజనీరింగ్ కళాశాల(College of Engineering) ప్రాంగణంలో డిసెంబర్ 30న (మంగళ వారం) ఉదయం 9 గంటల నుండి జాబ్ మేళా నిర్వహించనున్న‌ట్లు జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ తెలిపారు. నిరుద్యోగ యువతీ యువకులు ఈ మెగా జాబ్ మేళాను ఉపయోగించుకోవాలన్నారు.

ఈ మేళాలో టెక్ మహీంద్రా(Tech Mahindra), మిరాకిల్ సాఫ్ట్వేర్, టెక్నో ఫజల్ ప్రవేట్ లిమిటెడ్, ఇన్స్ట్రక్టో ఎడోటెక్ ప్రవేట్ లిమిటెడ్ , నష్ ఇండస్ట్రీ( ఎలక్ట్రికల్ వెహికల్ మాన్యుఫాక్చరింగ్ కంపెనీ) డాక్టర్ రెడ్డీస్, హెట్రో, టాటా ఎలక్ట్రానిక్స్, యొకొమా టైర్స్ తో కలుపుకుని సుమారు 14 ప్రైవేట్ కంపెనీలు పాల్గొని 400 పై చిలుకు ఖాళీలకు నియామకాలు చేపట్టనున్నట్లు కలెక్టర్ తెలిపారు.

ఎస్‌ఎస్‌సీ, ఇంటర్మీడియట్, ఐటీఐ, డిప్లొమా, బీటెక్, డిగ్రీ, ఎమ్మెస్సీ ఆర్గానిక్ కెమిస్ట్రీ(M.Sc. Organic Chemistry), ఎన్నాటికల్ కెమిస్ట్రీ చదివిన 18 నుండి 30 ఏళ్ల మధ్య వయసున్న నిరుద్యోగ యువతి యువకులు అర్హులని కలెక్టర్ తెలిపారు. ఈ ఇంటర్వ్యూ లో ఎంపికైన వారికి శ్రీకాకుళం, విశాఖపట్నం, శ్రీ సిటీ నెల్లూరు, హైదరాబాద్, బెంగళూరు లలో ఉద్యోగ అవకాశాలు కల్పించడం జరుగుతుందని తెలిపారు

అభ్యర్థులు ఏపీ.గోవ్.ఇన్ వెబ్‌సైట్‌(Website)లో రిజిస్ట్రేషన్ చేసుకొని, రిఫరెన్స్ నంబర్, రెజ్యూమే, ఆధార్, విద్యార్హతల ఒరిజినల్స్, జెరాక్స్ కాపీలు, పాస్‌పోర్ట్ సైజు ఫోటోతో కలిసి ఉదయం 9 గంటలకు జాబ్ మేళా ప్రాంగణానికి రావాలని జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి ఉరిటి సాయికుమార్ తెలిపారు.మరిన్ని వివరాలకు 95509 67353, 83176 52552నంబర్ లను సంప్రదించవచ్చని చెప్పారు.

Leave a Reply