విజయా కోఆపరేటివ్ సొసైటీ ఎన్నికలు మంగళవారం 9 సెప్టెంబర్ 2025 ఉదయం 9గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు జరగనున్నాయి. ఈ ఎన్నికలలో తమ ప్యానెల్ ని అత్యధిక మెజారిటీతో గెలిపించ వలసిందిగా టీం విజయ ప్యానల్ వారు ఓటింగ్ లో పాల్గొంటున్న కాలనీవాసులందరినీ కోరుతున్నారు.
గడచిన పది సంవత్సరాల నుండి ఈ ప్రశాంతమైన వాతావరణంలో విజయా సొసైటీ MMCCC రెండు మేనేజ్ మెంట్ లు ఎంతో అవగాహన, సమన్వయంతో కలిసి మెలిసి పనులు చేయటం వలన సభ్యులందరి సహకారంతో అటు కాలనీ, ఇటు క్లబ్ హైదరాబాద్ లోనే ఆదర్శవంతమైన కాలనీగా పేరు గడించినదని టీం విజయ వారు తెలియజేసారు.
భవిష్యత్ లో ఈ మైత్రి సంబంధాలు కొనసాగుతూ, అటు కాలనీ, ఇటు క్లబ్ మరింత పురోగతి సాధించాలంటే టీం విజయ ప్యానెల్ కు తమ అమూల్యమైన ఓటు వేసి గెలిపించాల్సిందిగా కోరారు.

