నంద్యాల జిల్లా చాగలమర్రి టీచర్లతో ఆర్జేడీ
(నంద్యాల, ఆంధ్రప్రభ బ్యూరో) : వెనుకబడిన పదవ తరగతి విద్యార్థుల ప్రత్యేక ప్రణాళికను రూపొందించుకోవాలని, విద్యార్థులందరూ ఉత్తీర్ణులయ్యే విధంగా ఒక క్రమ పద్ధతిలో విద్యా బోధన చేయించి ప్రతి విద్యార్థి మంచి మార్కులతో పాస్ అయ్యే విధంగా చూడాల్సిన బాధ్యత ఉపాధ్యాయులదేనని విద్యాశాఖ కడప ఆర్జేడీ సామ్యూల్ (RJD SSamuel) పేర్కొన్నారు. గురువారం నంద్యాల జిల్లాలోని చాగలమర్రి ఆళ్లగడ్డ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. మధ్యాహ్న భోజనం పథకంను పరిశీలించారు. మెనూ ప్రకారం భోజనం వడ్డించాలని సూచించారు.
ఉపాధ్యాయులు బాధ్యతాయుతంగా పనిచేయాలన్నారు. ప్రతి విద్యార్థి ఉన్నత శిఖరాలకు చేరుకునే విధంగా ఉపాధ్యాయుడి నూతన విద్యా విధానంలో వచ్చే మార్పులు కనుగుణంగా బోధన ఉండాలన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ లు విద్యాశాఖ పై ప్రత్యేక ప్రణాళికలు రూపొందించారన్నారు. అందుకు అ ను గుణంగా ఉపాధ్యాయులు పని చేయాల్సిందిగా సూచించారు. విద్యార్థుల చదువును పరిశీలించారు. పాఠ్య ప్రణాళిక ప్రకారం విద్యార్థులకు చదువు చెప్పాలన్నారు.
ఉపాధ్యాయుల హాజరు (Teacher attendance) అమరావతి కేంద్రం నుంచి పరిశీలిస్తున్నారని, ఏ ఒక్క ఉపాధ్యాయుడు కూడా విధులకు ఆలస్యంగా రాకూడదన్నారు. ప్రజల పట్ల ఏ ఒక్క ఉపాధ్యాయుడు ఈదుల పట్ల నిర్లక్ష్యం వహించిన కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. వర్షాకాలంలో వర్షాలు పడే సమయంలో భవన నిర్మాణాలను పరిగణలోకి తీసుకోవాలన్నారు. శిధిలావస్థలో ఉన్న భవనాల కింద విద్యార్థులను కూర్చోబెట్టరాదని ఉపాధ్యాయులకు తెలిపారు. అనంతరం సమీక్ష సమావేశం నిర్వహించారు.
