Tea Stall | పాపం కూర్చున్న చోటే…

Tea Stall | పాపం కూర్చున్న చోటే…

Tea Stall | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : టీ స్టాల్ వద్దకు వచ్చిన వ్యక్తి కూర్చుని అక్కడికక్కడే కుప్పకూలిన ఘటన తెలంగాణ రాష్ట్రంలోని ఆసిఫాబాద్ (Asifabad) జిల్లాలో చోటుచేసుకుంది.

ఆసిఫాబాద్ మండలం వెంకటాపూర్ గ్రామానికి చెందిన పర్చకి లచ్చు(40) (parchaki lachu) కూర్చున్న చోటే కుప్పకూలి మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. ఆసిఫాబాద్ ప్రభుత్వ ఆసుపత్రి ఎదుట ఓ టీ స్టాల్ (Tea Stall) వద్ద గద్దెపై కూర్చుని అకస్మాత్తుగా కుప్పకూలిపోయాడు. గమనించిన స్థానికులు వెంటనే 108కు సమాచారం అందించి ఆసుపత్రికి తరలించారు. వైద్యులు పరీక్షించి అప్పటికే మృతి చెందినట్లు ధ్రువీకరించారు. దీనికిపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

Leave a Reply