TDP vs YSRCP | రాజకీయ ఉద్రిక్తతలు…

TDP vs YSRCP | రాజకీయ ఉద్రిక్తతలు…

TDP vs YSRCP | ఆంధ్రప్రభ వెబ్ డెస్క్ : తిరువూరు నియోజకవర్గం (Thiruvur Constituency) లో రాజకీయ ఉద్రిక్తతలు రోజురోజుకూ తీవ్ర స్థాయికి చేరుకున్నాయి. అభివృద్ధి, అభివృద్ధి లేకపోవడం అంశంపై అధికార టీడీపీ, విపక్ష వైసీపీ నేతలు బహిరంగ చర్చకు సిద్ధమయ్యారు. గత రెండు రోజులుగా ఇరుపార్టీల నేతల మధ్య సవాళ్లు, ప్రతిసవాళ్లు, బెదిరింపులు, ఆరోపణలు బహిరంగంగా కొనసాగుతున్నాయి.

ఈ నేపథ్యంలో బోస్ బొమ్మ సెంటర్ (Bosbomma Center) లో బహిరంగ చర్చ జరగాలని ఇరువర్గాల నేతలు బయలుదేరగా… పోలీసులు వెంటనే రంగప్రవేశం చేశారు. రెండువర్గాల నేతలను అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించారు.తాజాగా స్థానిక తహసీల్దార్ (Tahsildar) తిరువూరు మండల వ్యాప్తంగా 144 సెక్షన్ (Section 144) విధించారు. 5 మంది లేదా అంతకంటే ఎక్కువ మంది ఒకే చోట గుమికూడకుండా నిషేధం విధించారు. నిబంధనలు ఉల్లంఘిస్తే IPC సెక్షన్ 188 ప్రకారం జైలుశిక్ష లేదా జరిమానా విధించే అవకాశం ఉంది.

పరిస్థితిని అదుపులో ఉంచేందుకు పోలీసులు భారీగా మోహరించారు. బోస్ బొమ్మ సెంటర్ వద్ద, నియోజకవర్గంలోని కీలక ప్రాంతాల్లో భద్రతా ఏర్పాట్లు కట్టుదిట్టంగా చేశారు. ఈ పరిణామాలతో తిరువూరులో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా ఉద్రిక్తంగా మారిపోయింది.

Leave a Reply