TDP OFFICE : కృష్ణాజిల్లా టీడీపీ ఆఫీస్ శంకుస్థాపన Andhra Prabha News

TDP OFFICE : కృష్ణాజిల్లా టీడీపీ ఆఫీస్ శంకుస్థాపన Andhra Prabha News
మంత్రి, కొల్లు రవీంద్ర..ఎమ్మెల్యేలు ప్రత్యేక పూజలు
మచిలీపట్నంలో పసుపు సేన సందడే సందడి
మచిలీపట్నం – ఆంధ్రప్రభ

కృష్ణా జిల్లాలోని మచిలీపట్నంలో నూతన తెలుగుదేశం పార్టీ కార్యాలయ నిర్మాణానికి శంకుస్థాపన కార్యక్రమాన్ని ఆదివారం నిర్వహించారు. వేద పండితుల వేదమంత్రోచ్ఛారణల నడుమ పూజా కార్యక్రమాలను నిర్వహించారు ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర, ఏపీఎస్ ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ళ నారాయణ రావు, జిల్లా టీడీపీ అధ్యక్షులు, గౌడ కార్పొరేషన్ చైర్మన్ వీరంకి గురుమూర్తి, ఎమ్మెల్యేలు యార్లగడ్డ వెంకట్రావు, కాగిత కృష్ణ ప్రసాద్, బోడె ప్రసాద్, వెనిగండ్ల రాము, వర్ల కుమార్ రాజా శంకుస్థాపన కార్యక్రమాల్లో పాల్గొన్నారు. జిల్లా నలుమూలల నుంచి అధిక సంఖ్యలో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు భారీ సంఖ్యలో హాజరయ్యారు. కృష్ణా జిల్లాలోని ఏడు నియోజకవర్గాల్లో ఆరు నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీ సార్వత్రిక ఎన్నికల్లో విజయడంకా మోగించింది.

కృష్ణా జిల్లాలో తెలుగుదేశం పార్టీ ఉండడం చాలా బలం ఉండటంతో పార్టీ కార్యక్రమాల నిర్వహణకు జిల్లా స్థాయిలో కార్యాలయ ఏర్పాటుకు అడుగులు పడ్డాయని పార్టీ వర్గాలు తెలుపుతున్నాయి. ఏమ్మెల్సీ పంచుమర్తి అనురాధ, మాజీ ఎమ్మెల్యే చైర్మన్ రావి వెంకటేశ్వరావు, మాజీ ఎమ్మెల్యే టీడీపీ నాయకులు బూరగడ్డ వేదవ్యాస్, మాజీ ఏమ్మెల్సీ వైవీబీ రాజేంద్ర ప్రసాద్, రాష్ట్ర బీసీ నాయకులు, రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కార్యనిర్వాహక కార్యదర్శి కొనకళ్ళ బుల్లయ్య, డిసిఎంఎస్ చైర్మన్ బండి రామకృష్ణ, టీడీపీ నాయకులు కనపర్తి శ్రీనివాస్, వెలగపూడి శంకర్ బాబు, గుమ్మడి గోపాల కృష్ణ, గోపు సత్యనారాయణ, మోటమరి బాబాప్రసాద్, తలశిల స్వర్ణ లత, యార్లగడ్డ సుచరిత, బత్తిన దాసు, కాగిత వెంకటేశ్వర రావు, వెంకటస్వామి, పీవీ ఫణి, ఆళ్ళ వెంకటేశ్వర రావు, కోనేరు నాని, వెంకన్న పాల్గొన్నారు.
