TDP leaders | సీఎం చిత్ర పటానికి పాలాభిషేకం
TDP leaders | నాగాయలంక, ఆంధ్రప్రభ : బిజినెస్ రీఫార్మర్ ఆఫ్ ద ఇయర్ అవార్డుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎంపికైన సందర్భంగా టీడీపీ నాయకులు, మత్స్యకార సంఘ నేతలు హర్షం వ్యక్తం చేశారు. శుక్రవారం నాగాయలంక బోస్ విగ్రహం వద్ద చంద్రబాబు చిత్ర పటానికి పాలాభిషేకం చేశారు. లకనం నాగాంజనేయులు, కర్రి కృష్ణమూర్తి, మండవ బాబురావు, సైకం విజయ భాస్కరరావు తదితరులు పాల్గొన్నారు.

