TDP | ప్రజల వద్దకు పరిపాలన …

TDP | ప్రజల వద్దకు పరిపాలన …

  • అభివృద్ధి టిడిపి ద్యేయం…
  • 40 లక్షల రూపాయల నిధులతో నూతన ఎం ఈ ఓ కార్యాలయం..

TDP | నంద్యాల బ్యూరో, ఆంధ్రప్రభ : టీడీపీ ప్రభుత్వం ప్రజల వద్దకు పాలనలో భాగంగా అనేక సంస్కరణలు చేపట్టిందని అందులో భాగంగా 40 లక్షల రూపాయలతో నూతన మండల విద్యాశాఖ అధికారి భవన నిర్మాణం ప్రారంభిస్తున్నట్లు టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ఏడి ఫిరోజ్ పేర్కొన్నారు. ఈ రోజు నంద్యాల నియోజకవర్గంలోని గోస్పాడు మండల కేంద్రంలో 7 సెంట్ల స్థలంలో 40 లక్షల రూపాయల నిధులతో మండల విద్య శాఖ అధికారి కార్యాలయ భవన నిర్మాణ పనులకు భూమి పూజ కార్యక్రమం చేపట్టారు. విద్యా పరిపాలనను మరింత సులభతరం చేస్తూ ఈ నూతన భవనం ఉపయోగపడుతుందన్నారు.

మండల స్థాయిలో విద్యా వ్యవస్థకు మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పించడమే లక్ష్యంగా రాష్ట్ర మంత్రి ఎన్ ఎండీ ఫరుక్ కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ ప్రమిల, టీడీపీ నాయకులు విశ్వనాధ్ రెడ్డి, యాళ్ళురు వెంకట రెడ్డి, వీర సింహ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, హుస్సేని, మనోజ్, మాజీ ఎంపీటీసి హుస్సేని, శ్రీనివాస్ యాదవ్, జిల్లెల సదాశివారెడ్డి, మాజీ కౌన్సిలర్ మిద్దె హుస్సేని, ఎమ్మార్వో, ఎంపీడీఓ, ఎంఈవో, ఉర్దూ డైరెక్టర్ హస్మూద్దీన్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply