TDP | భువనేశ్వరి మరిన్ని అవార్డులు అందుకోవాలి

TDP | భువనేశ్వరి మరిన్ని అవార్డులు అందుకోవాలి

  • నియోజకవర్గ యువనాయకులు మండలి వెంకట్రామ్
  • ఎన్టీఆర్ స్కూల్లో టీడీపీ ఆధ్వర్యంలో వేడుకలు

TDP | చల్లపల్లి – ఆంధ్రప్రభ : సమర్థవంతమైన పనితీరుతో ముందుకు సాగుతున్న నారా భువనేశ్వరి మరిన్ని విజయాలు అందుకోవాలని నియోజకవర్గ యువనాయకులు మండలి వెంకట్రామ్ ఆకాంక్షించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సతీమణి, హెరిటేజ్ ఫుడ్స్ లిమిటెడ్ వైస్ చైర్ పర్సన్, మేనేజింగ్ డైరెక్టర్ నారా భువనేశ్వరి జాతీయ స్థాయిలో ప్రతిష్టాత్మక సంస్థ ఇండియన్ డెయిరీ అసోసియేషన్ వారిచే ఔట్ స్టాండింగ్ డైరీ ప్రొఫెషనల్ అవార్డు -2025 అందుకున్న సందర్భంగా సోమవారం చల్లపల్లి మండలం పాగోలులోని ఎన్టీఆర్ మోడల్ స్కూలులో వేడుకలు ఘనంగా నిర్వహించారు.

టీడీపీ మండల పార్టీ ప్రధాన కార్యదర్శి యార్లగడ్డ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వేడుకలకు ముఖ్య అతిథిగా నియోజకవర్గ యువనాయకులు వెంకట్రామ్ విచ్చేసి ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కేక్ కట్ చేసి పంచిపెట్టారు. కార్యక్రమంలో టీడీపీ మండల అధ్యక్షులు, వైస్ ఎంపీపీ మోర్ల రాంబాబు, డీసీ చైర్మన్ నిడమనూరు దిలీప్ కుమార్, టీడీపీ నాయకులు నాదెళ్ల నర్స‌య్య, టీడీపీ ఎస్సీ సెల్ నియోజకవర్గ కార్యదర్శి బుల్లా కిషోర్, క్లస్టర్ ఇన్‌చార్జి మల్లంపల్లి శివరామకృష్ణ, తెలుగునాడు ఉపాధ్యాయ సంఘ రాష్ట్ర నాయకులు కైతేపల్లి దాస్, ఎన్టీఆర్ స్కూల్ ప్రిన్సిపాల్ గంగవరపు మధుసూద‌నరావు పాల్గొన్నారు.

Leave a Reply