చెన్నై : తమిళనాడులో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. కడలూరు జిల్లా చెమ్మంగుప్పంలో ప్రైవేట్ స్కూల్ వ్యాన్‌ను రైలు ఢీకొట్టింది. కాపలా లేని రైల్వే గేటును దాటడానికి ప్రయత్నిస్తుండగా ఈ ఘోరం జరిగినట్లు తెలుస్తోంది.
ప్రమాదంలో ముగ్గురు విద్యార్థులు అక్కడికక్కడే మృతి చెందారు. ప్రాథమిక నివేదికల ప్రకారం 10 మందికి పైగా విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న రెస్క్యూ సిబ్బంది హుటాహుటినా అక్కడికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.