చెన్నై: తమిళనాడు సర్కారు, కేంద్రం మధ్య హిందీ భాషా అంశంపై ఘర్షణ కొనసాగుతున్న నేపథ్యంలో తమిళనాడు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది. రాష్ట్ర బడ్జెట్ లోగోలో భారీ మార్పు చేసింది. బడ్జెట్ లోగోలో ఉండే రూపాయి గుర్తు స్థానంలో.. తమిళ సింబల్‌ను చేర్చింది. తమిళ సింబల్ ఉన్న బడ్జెట్ ప్రతులను.. శుక్రవారం అసెంబ్లీలో ప్రజెంట్ చేయనున్నారు. నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ ప్రకారం త్రిభాషా విధానాన్ని అమలు చేయాలని కేంద్రం వత్తిడి తెస్తున్న విషయం తెలిసిందే. కానీ డీఎంకే నేతృత్వంలోని తమిళనాడు సర్కారు మాత్రం హిందీ భాషను మూడవ భాషగా నేర్చుకునేందుకు వ్యతిరేకిస్తున్నది. ఈ నేపథ్యంలో కేంద్రం, తమిళనాడు మధ్య వైరం నడుస్తోంది.
అయితే రాష్ట్ర బడ్జెట్ ప్రతులపై ఉండే లోగోని హిందీ రూపాయి అక్షరాన్ని తీసి వేసి తమిళ లెటర్‌ను జోడించడం పట్ల ఇప్పటి వరకు తమిళనాడు సర్కారు ఎటువంటి ప్రకటన చేయలేదు. కానీ స్టాలిన్ సర్కారు భిన్నంగా వ్యవహరిస్తోందని బీజేపీ ఆరోపించింది. యావత్ దేశానికి రూపాయి సింబల్ కామన్‌గా ఉంటుందని నారాయనణ్ తిరుపతి పేర్కొన్నారు. లోగోలో పెట్టిన కొత్త సింబల్.. తమిళ అక్షరం రూ. రూపాయి అని పిలిచే పదంలో ఆ అక్షరం మొదలు వస్తుంది.