Tamilanadu | డీజిల్ తరలిస్తున్న గూడ్స్ రైల్లో ఫైర్ …

చెన్నై, ఆంధ్రప్రభ: తమిళనాడులోని (tamilanadu ) తిరువల్లూరు (tiruvaaluri) సమీపంలో భారీ అగ్నిప్రమాదం (fire accident ) జరిగింది. డీజిల్ తరలిస్తున్న గూడ్స్ రైలులో (goods rail ) మంటలు అంటుకున్నాయి. ఇండియన్ ఆయిల్ కంపెనీ డీజిల్‌తో 52 వ్యాగన్లతో కూడిన గూడ్స్ రైలు చెన్నై పోర్టు (chennai port ) నుంచి బెంగళూరుకు వెళ్తుంది. ఈ క్రమంలో తిరువల్లూరు సమీపంలో రైల్లో ఓ వ్యాగన్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. క్రమంగా అవి ఐదు వ్యాగన్లకు వ్యాపించడంతో భారీగా మంటలు ఎగసిపడ్డాయి.
దీంతో ఆ ప్రాంతంలో నల్లటి పొగలు దట్టంగా అలుముకున్నాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపుచేసేందుకు యత్నిస్తున్నారు. రెండు ఎన్‌డీఆర్‌ఎఫ్ బృందాలు సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు. కాగా, ప్రమాదం నేపథ్యంలో అప్రమత్తమైన రైల్వే అధికారులు ముందు జాగ్రత్త చర్యగా విద్యుత్ సరఫరాను నిలిపివేశారు. అదేవిధంగా చెన్నై-అరక్కోణం మధ్య రైళ్ల రాకపోకలను ఆపివేశారు. ప్యాసింజర్ రైళ్లను దారిమళ్లించారు.
