Tamil Nadu | సిద్ధాంతాలకు కట్టుబడి ఉంటాం

Tamil Nadu | సిద్ధాంతాలకు కట్టుబడి ఉంటాం
Tamil Nadu | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : తమిళనాడు రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల సమయం దగ్గరపడుతుండడంతో రాజకీయ సమీకరణాలు వేడి పెరుగుతోంది. కొత్త రాజకీయ పార్టీల ఆవిర్భావం, పొత్తుల విషయాలపై వేగంగా రాజకీయాలు మారుతున్నాయి. అయితే తాజాగా… ‘తమిళగ వెట్రి కళగం’ (TVK) అధినేత, దళపతి విజయ్ తన రాజకీయ పంథాను స్పష్టం చేశారు. కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీయే (NDA) కూటమితో పొత్తు ఉంటుందన్న ఊహాగానాలకు తెరదించుతూ, 234 నియోజకవర్గాల్లో తన పార్టీ ఒంటరిగానే పోటీ చేస్తుందని విజయ్ తేల్చిచెప్పారు.
గతకొన్ని రోజులుగా బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి విజయ్ను తమవైపు తిప్పుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లు వార్తలు వచ్చాయి. అయితే, విజయ్ తన సిద్ధాంతాలకు కట్టుబడి ఉండాలని నిర్ణయించుకున్నారు. విజయ్ తన ప్రసంగాల్లో బీజేపీని ‘సైద్ధాంతిక శత్రువు’గా, డీఎంకేను ‘రాజకీయ ప్రత్యర్థి’గా అభివర్ణించారు.

CLICK BERE TO READ MORE : Israel |10 మిస్సైళ్లతో నార్త్ కొరియా ఎటాక్
