Tamil Cinema | కార్తి సినిమా తెలుగు రిలీజ్ లేనట్టేనా…?

Tamil Cinema | కార్తి సినిమా తెలుగు రిలీజ్ లేనట్టేనా…?
ఆంధ్రప్రభ వెబ్ డెస్క్ : కార్తి హీరోగా నటించిన లేటెస్ట్ తమిళ్ మూవీ వా వాతియార్ తెలుగులో అన్నగారు వస్తారు పేరుతో ఇటీవల రిలీజ్ కు రెడీ అయ్యింది. అయితే.. ఈ సినిమా ఫైనాన్షియర్స్ మధ్య వచ్చిన కోర్టు వివాదాలతో తెలుగు రిలీజ్ ఆగిపోయింది. తమిళంలో మాత్రం సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈమధ్య ఈ మూవీని తెలుగులో రిలీజ్ చేస్తారని వార్తలు వచ్చాయి. అయితే.. ఇప్పుడు తెలుగులో రిలీజ్ లేనట్టే అని టాక్ వినిపిస్తోంది. ఇంతకీ.. ఏమైంది..?

విజయ్ జననాయగన్ రిలీజ్ ఆగిపోవడంతో కార్తి వా వాతియార్ కోలీవుడ్ లో థియేటర్స్ లోకి వచ్చింది. అయితే తెలుగు రిలీజ్ మాత్రం ఆగిపోయింది. తెలుగులో ప్రీ రిలీజ్ ఈవెంట్ చేశారు. హీరో కార్తి, హీరోయిన్ కృతిశెట్టి ఇంటర్వ్యూస్ ఇచ్చారు. తెలుగులో ఇలా పబ్లిసిటీ చేశాక సినిమా విడుదల చేయకపోవడం హాట్ టాపిక్ అయ్యింది. తాజాగా ఈ సినిమా తెలుగు సహా అన్ని భాషల్లో ప్రైమ్ వీడియో వేదికగా స్ట్రీమింగ్ కు వచ్చింది. ఈ నెల 28 నుంచి ఈ సినిమా స్ట్రీమింగ్ అయ్యింది. ఇక తెలుగు రిలీజ్ లేనట్లే అనుకోవాలి. రిలీజైన రెండు వారాల్లోనే ఓటీటీలోకి వచ్చిందీ మూవీ.

అన్నగారు వస్తారు చిత్రాన్ని స్టూడియో గ్రీన్ సంస్థ నిర్మించింది. కల్ట్ డైరెక్టర్ గా పేరున్న నలన్ కుమారస్వామి తెరకెక్కించారు. ఈ సినిమా కృతిశెట్టికి తమిళ డెబ్యూ మూవీ. ఆమెకు తమిళంలో తొలి సినిమానే ఇలాంటి చేదు ఫలితాన్ని అందించింది. కార్తి లాంటి పేరున్న హీరో సినిమా రిలీజైన రెండు వారాలకే ఓటీటీలోకి రావడం చర్చనీయాంశం అయ్యింది. దీని పై కోలీవుడ్ లో డిస్ట్రిబ్యూటర్స్ లో పెద్ద చర్చ జరుగుతుందని వార్తలు వస్తున్నాయి. సినిమా రిలీజైన రెండు వారాలకే ఓటీటీలోకి వస్తే.. ఇలాగే కంటిన్యూ చేస్తే.. జనాలు థియేటర్స్ కు రారు. మరి.. ఓటీటీలో రిలీజ్ చేయడం పై నిర్మాతలు కఠిన నిర్ణయాలు తీసుకుంటారేమో చూడాలి.

