పదవ తరగతి టాలెంట్ టెస్ట్‌లో విజేతలకు బహుమతులు

పదవ తరగతి టాలెంట్ టెస్ట్‌లో విజేతలకు బహుమతులు
పరకాల, ఆంధ్రప్రభ : పదవ తరగతి టాలెంట్ టెస్ట్ లో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు ప్రధానం చేశారు. పరకాల పట్టణంలోని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో ఎస్ఎఫ్ఐ నిర్వహించిన పదవ తరగతి టాలెంట్ టెస్ట్ విజేతలకు బహుమతుల ప్రధానం కార్యక్రమం పరకాల మండల అధ్యక్షుడు మడికొండ ప్రశాంత్ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ప్రైవేట్ పాఠశాలల నుండి మొదటి బహుమతి శారద పాఠశాల విద్యార్థిని డి సిరివెన్నెల, రెండవ బహుమతి ఎస్ ఆర్ పాఠశాల ఉతమ్ శెట్టి, ప్రభుత్వ పాఠశాల నుండి మొదటి బహుమత ప్రభుత్వ బాలికల పాఠశాల విద్యార్థి పి అక్షయకు పరకాల ఎస్ఐ పవన్ కుమార్, ఎస్వీ కళాశాల చైర్మన్, విద్యావేత్త సిరికొండ శ్రీనివాస్ చారి బహుమతులు ప్రధానం చేశారు.
అనంతరం వారు మాట్లాడుతూ విద్యార్థులు బాగా చదివి వారి తల్లిదండ్రులకు, పాఠశాలకు మంచి పేరు తీసుకుని రావాలని, విద్యార్థులు జీవితంలో ఉన్నత స్థాయికి ఎదగాలన్నారు. మార్చి పద్నాలుగు నుండి జరగబోయే పదవ తరగతి ఫైనల్ ఎగ్జామ్ లో ఎలాంటి భయం లేకుండా మంచిగా రాసి ఉత్తీర్ణత సాధించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ హనుమకొండ జిల్లా ఉపాధ్యక్షుడు బొచ్చు కళ్యాణ్, పరకాల పట్టణ అధ్యక్షుడు బొచ్చు ఈశ్వర్, జిల్లా కమిటీ సభ్యుడు బొజ్జ హేమంత్ ప్రభుత్వ బాలికల పాఠశాల ఇన్చార్జి కల్పన, పద్మ, ధనలక్ష్మి, విద్యార్థులు పాల్గొన్నారు.
