హెచ్.జె.దొరకు తలసాని నివాళులు

హెచ్.జె.దొరకు తలసాని నివాళులు
హైదరాబాద్, ఆంధ్రప్రభ : మాజీ DGP హెచ్.జె. దొరకు మాజీమంత్రి, డిప్యూటీ ప్లోర్ లీడర్ తలసాని శ్రీనివాస్ యాదవ్ నివాళులర్పించారు. నిమ్స్ లో చికిత్స పొందుతూ హెచ్.జె.దొర నిన్న చనిపోయారు. ఆయన మరణవార్త తెలుసుకున్న ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ ఇవాళ బంజారాహిల్స్ లోని నివాసానికి వెళ్లి పార్ధీవదేహంపై పూల మాల వేసి నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి తన సంతాపం తెలిపారు.

