ఉచిత మెగా ఆరోగ్య శిబిరం సద్వినియోగం చేసుకోండి

  • బికెఆర్ ఫౌండేషన్ చైర్మన్ గవినోళ్ళ బాలకృష్ణారెడ్డి

మక్తల్, ఆంధ్రప్రభ : బికెఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈ నెల 12న హైదరాబాద్ యశోద హాస్పిటల్ వారిచే నిర్వహిస్తున్న ఉచిత మెగా ఆరోగ్య శిబిలాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని బికెఆర్ ఫౌండేషన్ చైర్మన్ గవినోళ్ళ బాలకృష్ణారెడ్డి విజ్ఞప్తి చేశారు.

శుక్రవారం ఆయన ఆంధ్రప్రభ ప్రతినిధి తో మాట్లాడుతూ… ఈ నెల 12న నారాయణపేట జిల్లా మక్తల్ మండలంలోని సంగంబండ గ్రామంలో ప్రజల కోసం ఉచిత మెగా ఆరోగ్య శిబిరం నిర్వహిస్తున్నామని తెలిపారు.

గ్రామంలో నిర్వహిస్తున్న శిబిరంలో గుండె వ్యాధికి సంబంధించి (కార్డియాలజీ), చిన్నపిల్లల వ్యాధులకు సంబంధించి (చిల్డ్రన్ స్పెషలిస్ట్ ), స్త్రీ వ్యాధులకు సంబంధించి (గైకనాలజిస్ట్), బోన్స్ వ్యాధికి సంబంధించి (ఆర్థోపెడిక్), సాధారణ రోగాలకు సంబంధించి (జనరల్ ఫిజీషియన్), కళ్ళకు సంబంధించిన వ్యాధులు (ఆప్తమాలజీ) వ్యాధులకు స్పెషలిస్టు వైద్యులచేత చికిత్సలు నిర్వహించడం జరుగుతుందని ఆయన తెలిపారు.

అదేవిధంగా ఈసీజీ , డి ఈ కో, షుగర్ వ్యాధులకు సంబంధించి ఉచితంగా టెస్టులు నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ మెగా ఆరోగ్యశివరాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అవసరమైన వారికి ఉచితంగా మందులు కూడా అందించనున్నట్లు బికేఆర్ ఫౌండేషన్ చైర్మన్ గవినోళ్ళ బాలకృష్ణ రెడ్డి తెలిపారు. ఈ మెగా ఆరోగ్య శిబిరానికి స్థానిక ఎమ్మెల్యే రాష్ట్ర పశుసంవర్ధక క్రీడల శాఖ మంత్రి డాక్టర్ వాకిటి శ్రీహరి ముఖ్యఅతిథిగా హాజరై ప్రారంభిస్తారని ఆయన తెలిపారు.

Leave a Reply