కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలి

కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలి

నిజాంపేట,అక్టోబర్23(ఆంధ్రప్రభ) మండల పరిధిలోని నందిగామ గ్రామంలో గురువారం రామాయంపేట ప్రాథమిక సహకార సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని స్థానిక తహసిల్దార్ శ్రీనివాస్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతులు ప్రభుత్వం ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. కొనుగోలు కేంద్రాలకు తరలించేటప్పుడు నాణ్యత ప్రమాణాలను పాటించాలని దళారులను నమ్మి మోసపోవద్దన్నారు. ఈ కార్యక్రమంలో సొసైటీ సెక్రెటరీ జ్యోతి,ఏఈఓ రమ్య, కాంగ్రెస్ నాయకులుహృషికేష్ యాదవ్, చందు, లింగ స్వామి, సిద్దరాములు,మల్లారెడ్డి, నాగులు,వినోద్,బాబు,నాగరాజ్,బాజా రాజు,శ్యాం రెడ్డి , యాదగిరి తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply