Tippers | ఆరు టిప్పర్లను పట్టుకున్న తహశీల్దార్..

Tippers | ధర్మపురి, ఆంధ్రప్రభ : ధర్మపురి మండలంలోని ఆరేపల్లి గ్రామం నుంచి గోదావరిలో ఇసుక అక్రమంగా తరలిస్తున్న ఆరు టిప్పర్లను ధర్మపురి తాహసిల్దార్ ఎరుకొండ శ్రీనివాస్ బుధవారం రాత్రి పట్టుకున్నారు. గోదావరి నుంచి ఎటువంటి అనుమతులు లేకుండా ఇసుక తరలిస్తున్న ఆరు టిప్పర్లు టీఎస్ 03 యూఏ 6399, టీఎస్ 22టీ 5242, ఏపీ 31 టీహెచ్ 7320, ఏపీ 15 వై 2618, టీజీ 07 వీ 9765, టీఎస్ 03 యూడీ 2215 నెంబర్ గల టిప్పర్ లను పట్టుకొని పోలీసులకు అప్పగించారు. ఈ టిప్పర్‌ల పై కేసు నమోదు చేయనున్నట్లు ఎస్‌ఐ గురక మహేష్ తెలిపారు.

Leave a Reply