Tadvayi | ప్రతి పేదవాడికి…ఇందిరమ్మ ఇళ్లు

Tadvayi | తాడ్వాయి, ఆంధ్రప్రభ : పార్టీలకు అతీతంగా ప్రతి పేదవాడికి ఇండ్లు నిర్మించి ,వారి సొంతింటి కల నెరవేర్చాలని ప్రభుత్వం చేపట్టిన ప్రతిష్టాత్మకమైన లక్ష్యంతో, ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్మోహన్రావు సహకారంతో ముందుకు సాగుతున్నామని ఏఎంసి వైస్ చైర్మన్ జక్కుల రాజిరెడ్డి అన్నారు. ఈ సందర్భంగా చిట్యాలలో గైని రాజమణి, పులి విజయ ఇందిరమ్మ ఇండ్లకు భూమి పూజ చేయడం జరిగిందని అన్నారు. చిట్యాలలో మొత్తం 26 ఇండ్లకు భూమి పూజ చేశామని, రెండు ఇండ్లు స్లాబ్ లెవల్ కంప్లీట్ అయ్యాయని, మిగతావి కొన్ని నిర్మాణ దశలో ఉన్నాయని అన్నారు.
గ్రామంలో ప్రతి పేదవారికి గుడిసె స్థాయి నుండి ఇల్లు నిర్మించుకుంటున్నందుకు సంతోషంగా ఉందని ఆయన అన్నారు. ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్మోహన్రావు సహకారంతో మరిన్ని ఇండ్లు నిర్మించుకునేలా కృషి చేస్తామని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి రాజేశ్వర్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ గ్రామ అధ్యక్షుడు మ్యాడమ్ బాలయ్య, కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు గైని సాయిలు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు గణిశ్యామ్ కిషన్ రావు, ఉప సర్పంచ్ మల్లేష్, విట్టల్ ,పులి ప్రభాకర్, ఇందిరమ్మ కమిటీ సభ్యులు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు.
