Republic day Parade | ఏపీ ఏటికొప్పాక శకటానికి మూడో స్థానం !
- ధన్యవాదాలు తెలిపిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్
ఢిల్లీలో జరిగిన రిపబ్లిక్ డే వేడుకల్లో ఏపీ ఏటికొప్పాక శకటాన్ని ప్రదర్శించిన సంగతి తెలిసిందే. కాగా, ఈ శటక పరేడ్ లో ప్రదర్శించిన శకటాల్లో.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శటకం మూడో స్థానంలో నిలిచింది. మొదటి రెండు స్థానాల్లో ఉత్తరప్రదేశ్, త్రిపుర నిలిచాయి. దీనిపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్పందించారు.
ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన ఏటికొప్పాక లక్క శకటం శకటాల శటకం… మూడో స్థానం సాధించడం ఆనందంగా ఉందన్నారు. ఈ సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని మోదీకి ప్రభుత్వం తరపున కృతజ్ఞతలు తెలిపారు.
ఎన్డీయే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రోజు నుంచి ఏటికొప్పాక బొమ్మలకు ప్రాచుర్యం కల్పించేందుకు అన్ని రకాల చర్యలు చేపట్టామన్నారు. బొమ్మల తయారీకి అవసరమైన అంకుడు కర్ర చెట్ల పెంపకాన్ని ప్రోత్సహిస్తున్నామన్నారు.
అతిథులకు ఇచ్చే సావనీర్‌లో కూడా ఏటికొప్పాక బొమ్మలకు చేర్చామని వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున ఏటికొప్పాక శకటాన్ని పంపిన సీఎం చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలిపారు.