t20teamindia | మున్ముందు బిజీ షెడ్యూల్

t20teamindia | మున్ముందు బిజీ షెడ్యూల్

t20teamindia | ఐపీఎల్ నుంచి మొద‌లు..
ఆ త‌ర్వాత అంత‌ర్జాతీయ మ్యాచులు
యువ ఆట‌గాళ్ల‌కు మంచా చాన్స్‌
భార‌త జ‌ట్టులో చోటు సంపాదించేందుకు య‌త్నం

t20teamindia | ఆంధ్ర‌ప్ర‌భ వెబ్‌డెస్క్ : టీ20 ప్ర‌పంచ‌క‌ప్ గెలిచిన త‌ర్వాత భార‌త ఆట‌గాళ్లు బిజీ కానున్నారు. మార్చి 28 నుంచి ఐపీఎల్ స్టార్ట్ కానుంది. ఆ వెంట‌నే అంత‌ర్జాతీయ మ్యాచుల బిజీ షెడ్యూల్ ఉంది. అయితే ఐపీఎల్‌లో రాణించి యువ ఆట‌గాళ్లు భార‌త జ‌ట్టులో చోటు సంపాదించుకోవాల‌ని చూస్తున్నారు. ఐపీఎల్ ముగిసిన వెంటనే ఆఫ్ఘనిస్తాన్ జట్టుతో ఓ టెస్ట్ మ్యాచ్, మూడు వన్డేల సిరీస్ ఆడనుంది. ఆ వెంటనే ఐర్లాండ్ పర్యటనను ముగించుకుని నేరుగా ఇంగ్లాండ్‌కు బయలుదేరుతుంది. ఇంగ్లాండ్ జట్టుతో జరగబోయే 5 టీ20లు, 3 వన్డేల భారీ సిరీస్‌కు ఐర్లాండ్ మ్యాచ్‌లు ఓ మంచి ప్రాక్టీస్‌లా ఉపయోగపడతాయని విశ్లేషకులు భావిస్తున్నారు. జులై 1న ఇంగ్లాండ్ సిరీస్ ప్రారంభం కానుండటంతో వాతావరణానికి అలవాటు పడేందుకు ఈ పర్యటన భారత్‌కు కీలకం కానుంది.

t20teamindia
t20teamindia

ఈ ఐర్లాండ్ పర్యటనలో ఐపీఎల్‌లో రాణించిన పలువురు యువ ఆటగాళ్లకు జాతీయ జట్టులో స్థానం దక్కే అవకాశం ఉంది. ప్రపంచ కప్ గెలిచిన ప్రధాన జట్టులోని కొందరు కీలక ఆటగాళ్లకు విశ్రాంతినిచ్చి బెంచ్ బలాన్ని పరీక్షించాలని సెలెక్టర్లు భావిస్తున్నారు. రింకూ సింగ్, యశస్వి జైస్వాల్ వంటి ఆటగాళ్లతో పాటు మరికొందరు కొత్త ముఖాలు ఈ సిరీస్‌లో మెరిసే అవకాశం ఉంది. ప్రపంచ ఛాంపియన్ హోదాలో భారత్ బరిలోకి దిగుతుండటంతో ఐర్లాండ్ ప్రేక్షకులు కూడా ఈ మ్యాచ్‌ల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

click here for more

click here for more sports news

Leave a Reply