కనకదుర్గమ్మను దర్శించుకున్న స్వామీజీలు…

(ఆంధ్రప్రభ, ఎన్టీఆర్ బ్యూరో) : తరతరాలుగా వారసత్వ సంపదగా వస్తున్న సనాతన ధర్మాన్ని పరిరక్షించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి పైన ఉందని పలువురు స్వామీజీలు పేర్కొన్నారు. సనాతన ధర్మం పరిరక్షణ కోసం పలు మఠాలకు చెందిన స్వామీజీలు ఆదివారం అమరావతిలో ప్రత్యేకంగా సమావేశం అయ్యారు.

అమరావతిలో జరిగిన ఈ సమావేశంలో స్వామీజీలు, న్యాయవాదులు పాల్గొన్నారు. సనాతన ధర్మాన్ని పరిరక్షించేందుకు ఎటువంటి అన్యాయం జరిగినా న్యాయవాదులు స్వచ్ఛందంగా, తమ సొంత ఖర్చులతో పోరాటం చేయాలని ఈ సమావేశంలో నిర్ణయించారు.

దుర్గమ్మను దర్శించుకున్న స్వామీజీల బృందం…

సనాతన ధర్మం పరిరక్షణ సమావేశం ముగిసిన తర్వాత విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై ఉన్న శ్రీదుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానంలో కొలువై ఉన్న కనకదుర్గమ్మ ఆలయాన్ని స్వామీజీల బృందం సందర్శించింది.

అమరావతి సైవక్షేత్రం శివ స్వామి, తిరుపతికి చెందిన రాధా మనోహర్ దాస్ స్వామి, గుంటూరు ప్రాంతానికి చెందిన భవానీ శంకర్ ఆనంద్ స్వామి, తెలంగాణ ప్రాంతంలోని విశ్వేశ్వర క్షేత్రానికి చెందిన ఆత్మానంద భారతి స్వామి, విజయవాడకు చెందిన భజిల్ గురు స్వామి తిరుపతికి చెందిన రాజేంద్ర ప్రసాద్ గురూజీ-స్కంద స్వామి, గిద్దలూరు ప్రాంతానికి చెందిన స్వామి సిద్ధేశ్వరానంద, రాజమండ్రి కి చెందిన విశ్వ శంకరానంద స్వామి, మాతాజీ మాత శివ చైత్రా నందా మయి లు కనకదుర్గమ్మ వారి దర్శనానికి ఆదివారం ఆలయానికి రాగా స్వామీజీలు, మాతాజీకి దుర్గమ్మ ఆలయం వద్ద ఆలయ ఏఈఓ ఎన్.రమేష్ బాబు ఘన స్వాగతం పలికారు.

కనకదుర్గమ్మ వారికి స్వామీజీలు ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం వేద పండితులు వేద ఆశీర్వచనం చేయగా ప్రధానాలయ ఏఈఓ ఎన్ రమేష్ వారికి అమ్మవారి ప్రసాదాన్ని, చిత్రపటాన్ని అందజేశారు.

Leave a Reply