Suresh | విద్యావంతులకే పట్టం కట్టండి
Suresh | నర్సంపేట్, ఆంధ్రప్రభ : విద్యావంతులను సర్పంచ్ ఎన్నికల్లో గెలిపిస్తే గ్రామాభివృద్ధికి తోడ్పడుతారని నర్సంపేట మండలం ముత్యాలమ్మ తండా సర్పంచ్ అభ్యర్థి బానోత్ సురేష్ తెలిపారు. గ్రామ అభివృద్ధికి ఎంఏ బీఈడీ చేసి గ్రామాభివృద్ధి సాధించాలనే లక్ష్యంతో సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నట్లు తెలిపారు. గత బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వ కాలంలో ముత్యాలమ్మ తండాలో సీసీరోడ్లతో పాటు అనేక అభివృద్ధి పనులను మాజీ ఎమ్మెల్యే పెది సుదర్శన్ రెడ్డి సహకారంతో పూర్తి చేసినట్లు తెలిపారు. యువతకు చేయూతనిస్తే అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడానికి దోహదపడుతుందని పేర్కొన్నారు.
ఏజెన్సీ లోని రెండవ గిరిజన గ్రామ పంచాయతీ అయిన ముత్యాలమ్మ తండాకు ఎనలేని సేవలు అందించడానికి తాను ఎన్నికల బరిలో నిలిచినట్లు తెలిపారు. బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఇద్దరు వార్డు సభ్యులను కూడా ఏకగ్రీవం చేశామని సర్పంచ్ అభ్యర్థిని అత్యధిక ఓట్ల మెజార్టీతో గెలిపించి తండా అభివృద్ధికి కృషి చేయాలని పేర్కొన్నారు. మాజీ సీఎం కేసీఆర్ గిరిజన తండాల అభివృద్ధి కోసం 500 ఓట్లు కలిగిన గిరిజన తండాను గ్రామపంచాయతీలుగా తీర్చిదిద్దడంతో పాటు కోట్ల రూపాయలు మంజూరు చేసినట్లు సురేష్ తెలిపారు. ఎల్లప్పుడు గిరిజన తండా అభివృద్ధిలో భాగంగా తమ తండాలో తమ రాజ్యం అనే నినాదంతో ముందుకు పోతున్నట్లు బానోత్ సురేష్ తెలిపారు. మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి సహకారంతో అభివృద్ధికి ప్రతి ఒక్కరూ ప్రతి నాయకులు సహకరించి అత్యధిక ఓట్లతో గెలిపిస్తే రానున్న ఐదేళ్ల కాలంలో తండాలో మిగిలిపోయిన రోడ్ల మరమ్మతులు సైడు కాలువలను పూర్తిచేసి అందరి మన్ననలను పొందడానికి కృషి చేస్తానని సురేష్ ఈ సందర్భంగా హామీ ఇచ్చారు.

