Supreme Court | సుబ్రహ్మణ్యస్వామి పిటిషన్ కొట్టివేత

Supreme Court | సుబ్రహ్మణ్యస్వామి పిటిషన్ కొట్టివేత

Supreme Court | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : తిరుమల (Tirumala) లడ్డూ ప్రసాదం తయారీలో కల్తీ నెయ్యి వాడారనే వివాదం త‌లెత్తిన విష‌యం తెలిసిందే. అయితే ఇందుకు సంబంధించి సిట్ (SIT) విచారణ నివేదిక అనంతరం ఏపీ ప్రభుత్వం దర్యాప్తు కోసం ప్రత్యేకంగా ఒక ఏకసభ్య కమిటీని నియమించడాన్ని సవాల్ చేస్తూ బీజేపీ సీనియర్ నేత సుబ్రహ్మణ్య స్వామి పిటిషన్ దాఖలు చేశారు. ఈ మేరకు ఇవాళ సుప్రీం ధర్మాసనం ఆ పిటిషన్‌పై విచారణ చేపట్టి సంచలన తీర్పను వెలువరించింది.

కల్తీ నెయ్యి కేసులో ఏకసభ్య కమిషన్‌ను సవాల్‌ చేస్తూ మాజీ ఎంపీ సుబ్రహ్మణ్యస్వామి వేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు (Supreme Court) కొట్టివేసింది. సిట్‌ నివేదిక మేరకు ఏపీ ప్రభుత్వం ఏకసభ్య కమిషన్‌ను నియమించింది. దీనిని సవాల్‌ చేస్తూ సుబ్రహ్మణ్యస్వామి (Subramanya Swamy) రిట్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన ధర్మాసనం పిటిషన్‌ను కొట్టివేస్తూ తీర్పునిచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక కమిటీ ఓవర్‌లాపింగ్‌ కిందికి రాదని స్పష్టం చేసింది.

Leave a Reply