Supreme Court: ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై విచారణ 18కి వాయిదా ..
ఢిల్లీ : పార్టీ ఫిరాయించిన 10మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేసేలా స్పీకర్‌ను ఆదేశించాలని కోరుతూ సుప్రీం కోర్టులో మూడు వేర్వేరు పిటిషన్లు దాఖలైన విషయం తెలిసిందే. ఇవాళ ఆ పిటిషన్లపై జస్టిస్ బీఆర్ గవాయి, జస్టిస్ కే.వినోద్ చంద్రన్ ద్విసభ్య ధర్మాసనం విచారణ చేపట్టంది. వాదనల సందర్భంగా ఒక ఎమ్మెల్యే బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొంది.. కాంగ్రెస్ పార్టీలో చేరి ఎంపీగా పోటీ చేశారని కేటీఆర్ తరఫు న్యాయవాది ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు. మిగతా ఎమ్మెల్యేల తీరుకు కూడా కోర్టుకు వివరించారు.
ఈ క్రమంలో అసెంబ్లీ కార్యదర్శి తరఫు న్యాయవాది ముకుల్ రోహత్గీ ఎమ్మెల్యేలపై అనర్హతకు రీజనబుల్ టైమ్ కావాలని అభ్యర్థించారు. అందుకు కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇప్పటికే 10 నెలల సమయం గడిచిందని.. అది రీజనబుల్ టైం కాదా అని ప్రశ్నించింది. అందుకు ముకుల్ రోహత్గీ స్పందిస్తూ.. తమ నిర్ణయాన్ని తెలిపేందుకు మరో నాలుగైదు రోజులు సమయం ఇవ్వాలని కోర్టును కోరారు. దీంతో తదుపరి విచారణను ఈనెల 18కి వాయిదా వేశారు.