ఆదరించండి.. అత్యధిక మెజార్టీతో గెలిపించండి..

ఆదరించండి.. అత్యధిక మెజార్టీతో గెలిపించండి..

క్యాతన్ పల్లి, ఆంధ్రప్రభ : ఈ నెల 11వ తేదీన జరిగే క్యాతలపల్లి మున్సిపల్ ఎన్నికల్లో తనను ఆదరించి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని టీఆర్ఎస్ 4వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థి శశి కుమార్ విన్నవించారు. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో కేవలం ముఖ్యమంత్రి కేసీఆర్ హయాంలోనే రాష్ట్రం అభివృద్ధి పథాన నడిచిందని, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక అనేక సంక్షేమ పథకాలన్నీ కుంటుపడ్డాయని వాపోయారు. రేషన్ కార్డుల నుండి మొదలు పెడితే ఆసరా పెన్షన్లు.. మిషన్ భగీరథ, క్యాతన్ పల్లి మున్సిపాలిటీలో ఇళ్ళ పట్టాలు తదితర అనేక సంక్షేమ పథకాలు గత ప్రభుత్వంలోనే అమల్లోకి వచ్చాయని చెప్పారు.

క్యాతన్ పల్లి మున్సిపాలిటీ సమగ్రాభివృద్ధిని కోరుకునే ప్రజలంతా బీఆర్ఎస్ కు సంపూర్ణ మద్దతునిచ్చి అత్యధిక స్థానాలు పట్టం కట్టాలని కోరారు. అదేవిధంగా క్యాతన్ పల్లి మున్సిపాలిటీలో గులాబీ జెండా ఎగిరేందుకు అందరు సహకరించాలని సూచించారు. నోట్లు గుమ్మరించి ఓట్లు దండుకునే వారిని నిశితంగా పరిశీలించాలని, పారదర్శక పాలన అందించే కెసిఆర్ పాలనకు పాలన వైపు ప్రజలు మొగ్గు చూపాలని శశికుమార్ పిలుపునిచ్చారు. ఎన్నికల ప్రచార కార్యక్రమంలో టిఆర్ఎస్ నాయకులు బండారి సూరిబాబు, మాజీ జడ్పీటీసీ వేల్పుల రవి, రేవెల్లి ఓదెలు, శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply