ఆంధ్రప్రభ వెబ్ డెస్క్ : సూపర్ స్టార్ మహేష్ బాబు(Superstar Mahesh Babu).. హాలీవుడ్ (Hollywood) హీరోల కటౌట్ కు ఏ మాత్రం తక్కువ కాదు.. అంతకు మించి అనేలా హ్యాండ్సమ్ లుక్స్ తో అందరినీ ఆశ్చర్యపరుస్తాడు. నేటితో 50వ వసంతంలోకి అడుగుపెడుతున్న బాబు.. ఏ 30 ఏళ్ల కుర్రాడిలా ఇప్పటికీ కనిపిస్తాడు. ఆయనకు ఏజ్ అనేది జస్ట్ నంబర్ మాత్రమే అనడానికి నిదర్శనంగా నిలుస్తారు. బాలనటుడిగానే ఎంట్రీ ఇచ్చి.. అందంలోనే కాకుండా.. నటనలోనూ తండ్రికి తగ్గ తనయుడు అని నిరూపించుకున్నారు. అంతే కాకుండా ఎంతో మంది చిన్నారులకు హార్ట్ ఆపరేషన్స్ చేయించి రియల్ హీరోగా కూడా నిలుస్తున్నారు.
సూపర్ స్టార్ మహేష్ బాబు పుట్టిన రోజు నేడు. ఈ సందర్భంగా ఆయనకు సోషల్ మీడియా వేదికగా సినీతారలు, అభిమానులు బర్త్ డే విషెస్ తెలుపుతున్నారు. ఈరోజు మహేష్ 50వ పుట్టిన రోజు కావడంతో ఈ వేడుకను చాలా ప్రత్యేకంగా జరుపుకుంటున్నారు ఫ్యాన్స్. మహేష్ తో తమకున్న అనుబంధాన్ని చెబుతూ ట్వీట్స్ చేస్తున్నారు. మరోవైపు అతడు రీరిలీజ్ సందర్భంగా థియేటర్ల వద్ద అభిమానుల సందడి వాతావరణం నెలకొంది. ఈ క్రమంలోనే తాజాగా మెగాస్టార్ చిరంజీవి మహేష్ బాబుకు బర్త్ డే విషెస్ తెలిపారు. మహేష్ తెలుగు సినిమాకు గర్వకారణం అంటూ ట్వీట్ చేశారు.
“ప్రియమైన మహేష్ బాబుకు 50వ పుట్టినరోజు శుభాకాంక్షలు. నువ్వు తెలుగు సినిమాకు గర్వకారణం. ప్రపంచాన్ని జయించాలనే లక్ష్యంతో ఉన్నావు. సంవత్సరం గడిచేకొద్ది నువ్వు చిన్నవాడివి అవుతున్నావు. రాబోయే సంవత్సరం మరింత అద్భుతంగా ఉండాలని.. ఎన్నో సంతోషకరమైన క్షణాలు రావాలని కోరుకుంటున్నాను” అంటూ విష్ చేశారు చిరు.
సుధీర్ బాబు విషెస్..
50వ పుట్టిన రోజు (birthday) సందర్భంగా మహేశ్ బాబుకు బావ సుధీర్ బాబు శుభాకాంక్షలు తెలిపారు. ఆయన ఆసక్తికరంగా పోస్ట్ పెట్టారు. ‘నా ప్రియమైన బావమరిది, గొప్ప సినిమాలు తీసినందుకు, మీ నాన్నగారి వారసత్వాన్ని గర్వంగా ముందుకు తీసుకెళ్లినందుకు, మా కుటుంబానికి బలమైన స్తంభంగా నిలిచినందుకు, ముఖ్యంగా నన్ను మరింత కష్టపడి పనిచేసేందుకు ఎప్పుడూ ప్రోత్సహిస్తున్నందుకు ప్రత్యేక ధన్యవాదాలు.. అలాగే మీకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నాను.’ అని చెప్పుకొచ్చారు.
“హ్యాపీ బర్త్‌డే(Happy Birthday) మహేష్ అన్నా.. ఎప్పుడూ నీకు విజయం దక్కాలని మనసారా కోరుకుంటున్నా..” తారక్
“హ్యాపీ 50వ పుట్టినరోజు ఛార్మింగ్ సూపర్ స్టార్ మహేష్ బాబు. అద్భుతమైన టాలెంట్‌కి, గోల్డెన్ హార్ట్‌కి ఒక గోల్డెన్ మైలురాయి ఇది. ఎప్పుడూ మీరు ఆరోగ్యంగా, ఆనందంగా ఉండాలి.. ఎన్నో విజయాలు సొంతం చేసుకోవాలి.” – డైరెక్టర్ బాబీ
“మహేష్‌కి 50 ఏళ్లా.. అసలు నమ్మలేకపోతున్నా! ఇంకా నేను తొలిసారి మహేష్‌ని చూసిన క్షణాలే గుర్తున్నాయి. ఆయన డెడికేషన్, ప్యాషన్ అద్భుతం. మహేష్ గురించి ఒక్క మాటలో చెప్పాలంటే ఆయన ఓ డైరెక్టర్ డైనమైట్. తన తండ్రి స్టార్‌డమ్‌ని ముందుకు తీసుకెళ్తూ తన ఫ్యాన్స్‌కి ఎప్పుడూ ఓ సూపర్‌స్టార్‌లా కనిపించడం చిన్న విషయం కాదు. కృష్ణగారు ఎప్పుడూ చెప్పినట్లుగా మహేష్‌ది ఓ హాలీవుడ్ హీరో స్థాయి.. అది SSMB29తో ప్రూ అవుతుంది. నాడు తెలుగు నాట మొదలైన నీ “దూకుడు” నేడు ప్రపంచవ్యాప్తంగా కొనసాగాలని కోరుకుంటూ… Love you Babu” – శ్రీను వైట్ల
“ప్రపంచంలోని బెస్ట్ డాడ్ అయిన నీకు హ్యాపీ బర్త్‌డే.. ఐలవ్యూ”- సితార
“మహేష్ బాబుకి పుట్టినరోజు శుభాకాంక్షలు. అసలు మిమ్మల్ని ఎవరితోనూ పోల్చలేం. మీ #SSMB29 కోసం ఇంట్రెస్టింగ్‌గా ఎదురుచూస్తున్నాం. కచ్చితంగా అది చరిత్ర సృష్టిస్తుంది” – నారా రోహిత్
‘‘హ్యాపీ బర్త్‌డే మహేష్. మీరు ఎన్నో విజయాలు అందుకోవాలని ఆశిస్తున్నా. SSMB29 ఎప్పుడెప్పుడు విడుదలవుతుందా అని చూస్తున్నా’’ – కిరణ్ అబ్బవరం
“ఏజ్‌ని మడతెప్టి.. ఏంటీ ఏజింగ్‌కి మైండ్ బ్లాక్ చేసిన సూపర్ స్టార్.. డియర్ ఫ్రెండ్ మహేష్ బాబుకి పుట్టినరోజు శుభాకాంక్షలు. ఆయనకి ఎప్పుడూ ఆరోగ్యం, విజయాలు దక్కేలా చూడాలని హనుమంతుడ్ని ప్రార్థిస్తున్నా. #SSMB29 చేయబోయే అద్భుతాల కోసం ఎదురుచూస్తున్నా”.. మెహర్ రమేష్
బాలనటుడిగా ఎంట్రీ..
సూపర్ స్టార్ కృష్ణ (Superstar Krishna,), ఇందిరా దేవి దంపతులకు 1975 ఆగస్టు 9వ తేదీన జన్మించారు మహేష్. ఆయన అన్న రమేష్ బాబు కూడా హీరోగా సత్తా చాటారు. అలానే పద్మావతి, మంజుల, ప్రియదర్శిని అనే ముగ్గురు సోదరీలు ఉన్నారు. రమేష్ బాబు హీరోగా నటించిన ‘నీడ’ (1979) అనే చిత్రంతో తొలిసారిగా వెండితెరపై కనిపించారు మహేష్. అప్పుడు అయన వయస్సు కేవలం నాలుగేళ్లు మాత్రమే. అలానే కృష్ణ హీరోగా నటించిన పలు సినిమాల్లో కూడా నటించి మెప్పించారు. ఆ తర్వాత మధ్యలో కొంచెం గ్యాప్ తీసుకొని 1999 లో ‘రాజకుమారుడు’ మూవీతో హీరోగా మారారు. నాటి నుంచి విభిన్న కథాంశాలు, వైవిధమైన పాత్రలు పోషిస్తూ అంచెలంచెలుగా ఎదిగారు.
25ఏళ్లలో 28 చిత్రాలు..
తన 25 ఏళ్ల సినీ కెరీర్ లో ఇప్పటి వరకూ 28 చిత్రాలతో నటించారు. నిర్మాతగానూ పలు సినిమాలను రూపొందించారు. ఈ క్రమంలో ఎన్నో అవార్డులు రివార్డులు సొంతం చేసుకున్నారు. ఉత్తమ నటుడిగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి 8 నంది పురస్కారాలను అందుకున్నారు. 5 ఫిలిం ఫేర్ అవార్డులతో సహా అనేక మరెన్నో పురస్కారాలను దక్కించుకున్నారు.
సోషల్ మీడియాలో కోటిపైగా ఫాలోవర్స్
అటు సినిమాలతో పాటే పలు యాడ్స్ లో కూడా నటిస్తూ ఫుల్ బిజీగా ఉంటారు మహేష్ బాబు. అంతే కాకుండా సోషల్ మీడియాలో సైతం యాక్టివ్ గా ఉంటూ తన పర్సనల్, ప్రొఫెషనల్ విషయాలను పంచుకుంటుంటారు. కాగా ఫేస్‌బుక్, ఎక్స్, ఇన్‌స్టాగ్రామ్.. ఒక్కో దానిలో కోటి మందికి పైగా ఫాలోవర్స్‌ను కలిగిన ఏకైక సౌత్ ఇండియన్ హీరో” గా కూడా నిలిచారు.
ప్రస్తుతం దర్శకధీరుడు రాజమౌళితో మూవీ…
ప్రస్తుతం దర్శకధీరుడు రాజమౌళి(Director Rajamouli)తో ఒక మూవీ చేస్తున్నారు. ఈ మూవీలో మాలీవుడ్ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్, బాలీవుడ్ బ్యూటీ ప్రియాంక చోప్రా కూడా నటిస్తున్నారు. SSMB29 అనే వర్కింగ్ టైటిల్ తో శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది ఈ చిత్రం. ఈ మేరకు ఈ ఏడాది నవంబర్‌లో అప్ డేట్స్ విడుదల చేయనున్నట్టు ప్రకటించారు. ఒక ఫోటోని కూడా పంచుకున్నారు. అలానే మేం సృష్టిస్తున్న ప్రపంచాన్ని మీకు చూపించేందుకు ప్రత్యేకంగా ఒక వీడియో సిద్ధం చేస్తున్నాం. ఇది ముందెన్నడూ చూడని విధంగా ఉంటుంది. మీ ఓపికకు ధన్యవాదాలు” అని జక్కన్న రాసుకొచ్చారు.
మహేశ్ బాబు పోస్టర్ రిలీజ్…
మహేశ్ బాబు పోస్టర్ రిలీజ్ ( Poster Release) మహేశ్ బాబు లుక్ పోస్టర్‌ను సోషల్ మీడియాలో షేర్ చేశారు జక్కన్న. అయితే ఇందులో మహేశ్ ఫేస్ కనిపించకుండా కేవలం ఛాతీ భాగమే కనిపిస్తోంది. అంతేకాదు.. ఛాతీపై కారుతున్న రక్తం, మెడలో ఓ మాలను ధరించాడు. ఈ మాల కింద భాగంలో శివుడి మూడో కన్ను, త్రిశూలం, ఢమరుకం, నంది, రుద్రాక్ష ఉన్నాయి. చూస్తుంటే మహేశ్ పోస్టర్ పూనకాలు తెప్పించేలా ఉంది. యాక్షన్ ఎడ్వెంచర్‌గా తెరకెక్కుతోన్న ఈ సినిమాకు ఆధ్యాత్మికంగానూ రాజమౌళి లింక్ చేసినట్లుగా పుకార్లు వస్తున్నాయి. ఇప్పటికే ఉన్న అంచనాలకు తోడు ఈ పోస్టర్ ఎస్ఎస్ఎంబీ 29పై హైప్ పెంచేసింది. నాగచైతన్యను అలా వదిలించుకున్న సమంత.. ప్రముఖ జ్యోతిష్యుడి షాకింగ్ కామెంట్స్ నవంబర్‌లో ఫుల్ పోస్టర్ ఈ పోస్టర్ ఫుల్ పోస్టర్‌ను గ్లోబ్ ట్రోట్టర్ పేరుతో ఈ ఏడాది నవంబర్‌లో రివీల్ చేస్తానని రాజమౌళి తెలిపారు.