ఐపీఎల్ 2025 క్వాలిఫయర్ 2లో పంజాబ్ కింగ్స్ చరిత్రలో ఓ కొత్త అధ్యాయం లిఖించింది. ముంబై ఇండియన్స్ నిర్దేశించిన 204 పరుగుల భారీ లక్ష్యాన్ని 19 ఓవర్లలోనే ఛేదించి 5 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ విజయంతో పంజాబ్ తొలిసారి ఐపీఎల్ ఫైనల్‌కు అడుగుపెట్టింది.
పంజాబ్ చరిత్రాత్మక ఛేదన:
204 పరుగుల లక్ష్యం సునాయాసం కాదన్న అంచనాలు అందరిలోనూ ఉన్నా, పంజాబ్ బ్యాటర్లు అందరి అంచనాలను తలకిందులు చేశారు. ఓపెనర్లు ప్రియాన్ష్ ఆర్య (20) జోష్ ఇంగ్లిష్ (38) బలమైన ఆరంభం అందించారు. వీరిద్దరూ రెండో వికెట్‌కు 18 బంతుల్లో 42 పరుగుల భాగస్వామ్యం అందించి… ఛేదనకు దారి చూపించారు.
ఆ తరువాత వచ్చిన కెప్టెన్ శ్రేయస్ అయ్యార్ విజృంభించారు. వరుస బౌండరీలతో కొండంత స్కోర్ ను కరిగించాడు. మొత్తం 41 బంతులు ఎదుర్కున్న శ్రేయస్ 5 ఫోర్లు, 8 సిక్సుల సాయంతో 87 పరుగులు చేసి నాటౌట్ గా ఇన్నింగ్స్ ముగించాడు. అతనికి తోడు నేహాల్ వధేరా కూడా విరుచుకుపడ్డాడు. 29 బంతుల్లో 78 పరుగులతో ఆకట్టుకున్నాడు.
ముంబై ఇన్నింగ్స్:
టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ నిర్ణీత ఓవర్లలో 203/6 పరుగులు చేసింది. జానీ బెయిర్‌స్టో (38), తిలక్ వర్మ (44), సూర్యకుమార్ యాదవ్ (44) తమ బ్యాటింగ్‌తో ముంబైకి బలమైన స్కోరు అందించారు. చివర్లో నమన్ ధీర్ 18 బంతుల్లో 37 పరుగులతో ముంబై స్కోరు 200 దాటేలా చేశాడు.
పంజాబ్ బౌలింగ్‌లో అజ్మతుల్లా ఒమర్జాయ్ 2 వికెట్లతో రాణించగా, జేమీసన్, స్టోయినిస్, వైషాక్, చాహల్ తలా ఒక్కో వికెట్ పడగొట్టారు.
చరిత్రలోకి పంజాబ్:
ఈ విజయం పంజాబ్ కింగ్స్‌కు చారిత్రక ఘట్టంగా నిలిచింది. 2008 నుండి ప్రారంభమైన ఐపీఎల్‌లో ఇప్పటి వరకూ ఒక్కసారి కూడా టైటిల్ గెలవలేని పంజాబ్, ఇప్పుడు తొలిసారి ఫైనల్ బరిలోకి అడుగుపెట్టింది. వారు ఫైనల్లో ఆర్సీబీతో తలపడనున్నారు.