సూప‌ర్ ఫోర్.. సూప‌ర్ ఎగ్జైటింగ్ !!

  • మ‌రోసారి కొమ్ములు దూస్తున్న భార‌త్-పాక్

ఆసియా కప్ 2025 సూపర్ ఫోర్ దశలో, క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న మ్యాచ్‌కు రంగం సిద్ధమైంది. చిరకాల ప్రత్యర్థులైన భారత్ – పాకిస్తాన్ జట్లు ఈ టోర్నీలో మరోసారి తలపడనున్నాయి.

కాగా, దుబాయ్‌లో జ‌రుగుతున్న ఈ పోరులో టాస్ గెలిచిన భార‌త్ కెప్టెన్ సూర్య కుమార్ యాద‌వ్ బౌలింగ్ ఎంచుకున్నాడు. దీంతో ముందుగా పాకిస్థాన్ జ‌ట్టు బ్యాటింగ్ చేయ‌నుంది. అయితే టాస్ స‌మ‌యంలోనూ ఇద్దరు కెప్టెన్ల మధ్య హ్యాండ్ షేక్ జరగలేదు.

తుది జ‌ట్లు
ఇండియా : అభిషేక్ శర్మ, శుభ్‌మన్ గిల్, సంజు శాంసన్ (WK), సూర్యకుమార్ యాదవ్ (c), తిలక్ వర్మ, శివమ్ దూబే, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, జస్ప్రీత్ బుమ్రా, కుల్దీప్ యాదవ్, వరుణ్ చకరవర్తి

పాకిస్థాన్ : సయీమ్ అయూబ్, సాహిబ్జాదా ఫర్హాన్, మహ్మద్ హరీస్ (WK), ఫఖర్ జమాన్, సల్మాన్ అలీ అఘా (c), ఫహీమ్ అష్రఫ్, హుస్సేన్ తలత్, మహ్మద్ నవాజ్, అబ్రార్ అహ్మద్, షాహీన్ అఫ్రిది, హరీస్ రవూఫ్

జట్ల ప్రతీకార పోరాటం..
గ్రూప్ దశలో భారత్ చేతిలో ఓటమి పాలైన పాకిస్తాన్, ఈ మ్యాచ్‌లో ప్రతీకారం తీర్చుకోవాలని ఉవ్విళ్లూరుతోంది. ముఖ్యంగా, ‘నో హ్యాండ్‌షేక్’ వివాదం తర్వాత ఈ మ్యాచ్‌పై ఉత్కంఠ మరింత పెరిగింది. మరోవైపు, భారత్ తమ ఆధిపత్యాన్ని కొనసాగించి, టోర్నమెంట్‌లో తమ స్థానాన్ని పటిష్టం చేసుకోవాలని చూస్తోంది. ఈ మ్యాచ్‌లో గెలుపు కేవలం పాయింట్ల కోసమే కాదు, రెండు జట్ల గౌరవం కోసం కూడా జరిగే పోరాటం.

రికార్డులు..
టీ20ల్లో పాకిస్తాన్ పై భారత్ పూర్తి ఆధిపత్యం చెలాయిస్తోంది. ఇప్పటివరకు ఇరు జ‌ట్ల మ‌ధ్య జ‌రిగిన మొత్తం 14 T20I మ్యాచ్‌ల్లో భారత్ 10 విజయాలు సాధించగా, పాకిస్తాన్ కేవలం 3 విజయాలు మాత్రమే సాధించింది. 2007లో ఒక మ్యాచ్ టై అయింది. T20I ఆసియా కప్‌లో జరిగిన నాలుగు మ్యాచ్‌ల్లో భారత్ మూడు గెలవగా, పాకిస్తాన్ ఒక విజయం సాధించింది. ఈ గణాంకాలు భారత్‌కు అనుకూలంగా ఉన్నప్పటికీ, ఈ రసవత్తర పోరులో ఫలితం ఎలా ఉంటుందో చూడాలి.

మ్యాచ్ ప్రసార వివరాలు..
భారతదేశంలో ఈ మ్యాచ్‌ను సోనీలివ్ (SonyLiv) యాప్‌లో లైవ్ స్ట్రీమింగ్ ద్వారా చూడవచ్చు, లేదా టీవీలో సోనీ స్పోర్ట్స్ టెన్ నెట్‌వర్క్‌లో ప్రత్యక్ష ప్రసారం అవుతుంది. క్రికెట్ అభిమానులకు ఇది మరో అద్భుతమైన, చారిత్రాత్మకమైన మ్యాచ్‌గా నిలవనుంది.

Leave a Reply